ప్రస్తుత ఐపీఎల్లో కోల్‌కతా వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఓడింది. కెప్టెన్ దినేశ్ కార్తీక్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. జట్టును ముందుండి నడపటమే తన బాధ్యతని.. గెలుపు ఓటములు జట్టు సమష్టి కృషిపైనా ఆధారపడి ఉంటాయని తెలిపాడీ క్రికెటర్.
గురువారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 97 పరుగులు చేసి ఆకట్టుకున్నాడీ బ్యాట్స్‌మెన్. 49-3 వికెట్లున్న స్థితి నుంచి 175 పరుగులు చేసేందుకు సహాయపడ్డాడు. కానీ రాజస్థాన్ జట్టులోని యువ సంచలనాలు రియాన్ పరాగ్ (47 రన్స్), జోప్రా ఆర్చర్(27 రన్స్) మెరుపులతో మ్యాచ్ కోల్‌కతా చేజారింది.
"కెప్టెన్‌గా జట్టను ముందుండి నడిపించడం నా బాధ్యత. కొన్నిసార్లు ఫలితాలు వేరుగా వస్తుంటాయి. అప్పుడు అందరూ కెప్టెన్‌గా నన్ను ప్రశ్నిస్తారు. ఈ విషయాన్ని నేను అర్థం చేసుకోగలను. జట్టులోని అందరూ కష్టపడుతున్నారు. తర్వాత మ్యాచ్‌ల్లో మా స్థాయికి తగ్గ ప్రదర్శన చేసి విజయాలు సాధిస్తాం. ఓటమికి గల కారణాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం" - దినేశ్ కార్తీక్, కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్
రాజస్థాన్ చేతిలో ఓటమి... కోల్‌కతా ఫ్లేఆఫ్ అవకాశాల్ని మరింత క్లిష్టం చేసింది. ప్రస్తుతం 11 మ్యాచ్‌లాడిన కోల్‌కతా నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచింది. 8 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది.