చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో గెలిచి ఐపీఎల్ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది రోహిత్ సేన. 132 పరుగుల లక్ష్య ఛేదనలో సూర్యకుమార్ యాదవ్ (71, 54 బంతుల్లో) అర్ధశతకంతో ఆకట్టుకోగా... ఇషాన్ కిషన్ (28) రాణించాడు. చెన్నై బౌలర్లలో తాహిర్ రెండు వికెట్లు తీయగా, హర్భజన్, దీపక్ చాహర్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు సూర్యకుమార్ యాదవ్‌కు దక్కింది.
-
Surya shines when it matters the most ☀️
— Mumbai Indians (@mipaltan) May 7, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
A 37-ball fifty in a big chase. Take a bow 💙
#OneFamily #CricketMeriJaan #MumbaiIndians #MIvCSK @surya_14kumar pic.twitter.com/p0FBNGEIhh
">Surya shines when it matters the most ☀️
— Mumbai Indians (@mipaltan) May 7, 2019
A 37-ball fifty in a big chase. Take a bow 💙
#OneFamily #CricketMeriJaan #MumbaiIndians #MIvCSK @surya_14kumar pic.twitter.com/p0FBNGEIhhSurya shines when it matters the most ☀️
— Mumbai Indians (@mipaltan) May 7, 2019
A 37-ball fifty in a big chase. Take a bow 💙
#OneFamily #CricketMeriJaan #MumbaiIndians #MIvCSK @surya_14kumar pic.twitter.com/p0FBNGEIhh
టాస్ ఓడి బౌలింగ్ చేసిన ముంబయి జట్టు చెన్నైని 131 పరుగులకు కట్టడి చేసింది. అనంతరం బ్యాటింగ్ దిగిన ముంబయి ఆరంభంలోనే రోహిత్ (4) వికెట్‌ను కోల్పోయింది. కాసేపటికే డికాక్ వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ - ఇషాన్ కిషన్ జోడి నిలకడగా ఆడుతూ... జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.
-
The Surya that shone with 🔵 in Chennai! How @mipaltan made an early entry into the #VIVOIPL 2019 final 🙌#MIvCSK pic.twitter.com/U2GmM4B32v
— IndianPremierLeague (@IPL) May 7, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">The Surya that shone with 🔵 in Chennai! How @mipaltan made an early entry into the #VIVOIPL 2019 final 🙌#MIvCSK pic.twitter.com/U2GmM4B32v
— IndianPremierLeague (@IPL) May 7, 2019The Surya that shone with 🔵 in Chennai! How @mipaltan made an early entry into the #VIVOIPL 2019 final 🙌#MIvCSK pic.twitter.com/U2GmM4B32v
— IndianPremierLeague (@IPL) May 7, 2019
చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ.. ఇబ్బందిపడకుండా ఆడిందీ జోడీ. అనంతరం చెన్నై బౌలర్ తాహిర్ వరుస బంతుల్లో ఇషాన్ కిషన్, కృణాల్ పాండ్యను ఔట్ చేసి ముంబయిని ఒత్తిడిలోకి నెట్టాడు. కానీ చివర్లో సూర్యకుమార్ యాదవ్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి జట్టును గెలిపించాడు.
సూర్యకుమార్ యాదవ్ అర్ధశతకం..
ఓ పక్క వికెట్లు కోల్పోతున్నా మ్యాచ్‌ను దగ్గరుండి గెలిపించాడు సూర్యకుమార్ యాదవ్. చెన్నై బౌలర్లను ధాటిగా ఎదుర్కొని ప్రత్యర్థికి విజయాన్ని దూరం చేశాడు. 37 బంతుల్లో 50 పరుగులు చేసి కెరీర్లో ఆరవ అర్ధశతకాన్ని నమోదు చేశాడు.
మొదట బ్యాటింగ్ చెసిన చెన్నై జట్టులో ధోనీ (37), అంబటి రాయుడు (42) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ రాణించలేదు. ముంబయి బౌలర్ రాహుల్ చాహర్ 2 కీలక వికెట్లు తీసి చెన్నై పతనంలో కీలకపాత్ర పోషించాడు. కృణాల్, జయంత్ యాదవ్ చెరో వికెట్ తీశారు.
ఈ మ్యాచ్ రికార్డులు..
చెన్నైపై వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచిన జట్టుగా ముంబయి ఇండియన్స్ రికార్డు సృష్టించింది.
- 2018 పుణెలో 8 వికెట్ల తేడాతో ముంబయి గెలుపు
- 2019 వాంఖడే వేదికగా 37 పరుగుల తేడాతో విజయం
- 2019 చెన్నై వేదికగా 46 పరుగులు తేడాతో విజయం
- 2019 చెన్నై వేదికగా 6 వికెట్ల తేడాతో విజయం
- చెపాక్‌లో చెన్నై సూపర్ కింగ్స్ గత 21 మ్యాచ్‌ల్లో 18 గెలవగా.. మూడింటిలో ఓడిపోయింది.
- ఐపీఎల్లో ఎక్కువ సార్లు ఫైనల్ వెళ్లిన జట్టు చెన్నై సూపర్‌కింగ్స్(7) కాగా.. ముంబయి 5 సార్లు తుదిపోరుకెళ్లి రెండో స్థానంలో ఉంది. ఆర్సీబీ 3 సార్లు వెళ్లి మూడో స్థానంలో ఉంది.