ఐదుసార్లు ఐపీఎల్ ఫైనల్కెళ్లిన ముంబయి నాలుగు సార్లు టైటిల్‌ను సొంతం చేసుకుంది. తొలిసారి 2013లో విజేతగా నిలిచిన రోహిత్ సేన అప్పటి నుంచి ఏడాది విరామంతో కప్పును చేజిక్కించుకుంటోంది. అందులోనూ బేసి సంవత్సరపు(2013, 15,17 , 19) అంకెల్లోనే ముంబయి విజేతగా నిలుస్తోంది.
- 2013లో కోల్‌కతా వేదికగా జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో ముంబయి 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో ముంబయి 148 పరుగులు చేయగా.. చెన్నై 125కే పరిమితమైంది.
- 2015లో కోల్‌కతాలో జరిగిన ఫైనల్లో ముంబయి 41 పరుగుల తేడాతో నెగ్గింది. ఇందులో రోహిత్ సేన మొదట 202 పరుగులు చేయగా... చెన్నై 161 పరుగులు మాత్రమే చేయగలిగింది.
- 2017లో రైజింగ్ పూణె సూపర్‌జైంట్ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ముంబయి ఒక్క పరుగు తేడాతో నెగ్గింది. ఈ మ్యాచ్‌లో ముంబయి 129 పరుగులు చేయగా.. రైజింగ్ పూణె 128 స్కోర్ చేసింది.
- ఈ సీజన్(2019)లోనూ చెన్నై సూపర్‌కింగ్స్‌పై ఒక్క పరుగు తేడాతోనే విజయం సాధించింది ముంబయి. ఈ మ్యాచ్‌లో ముంబయి 149 పరుగులు చేస్తే.. చెన్నై 148కే పరిమితమైంది.
-
#VIVOIPL 2019 Champions 🏆 - @mipaltan 🔥 pic.twitter.com/XPl5dzh2H6
— IndianPremierLeague (@IPL) May 12, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">#VIVOIPL 2019 Champions 🏆 - @mipaltan 🔥 pic.twitter.com/XPl5dzh2H6
— IndianPremierLeague (@IPL) May 12, 2019#VIVOIPL 2019 Champions 🏆 - @mipaltan 🔥 pic.twitter.com/XPl5dzh2H6
— IndianPremierLeague (@IPL) May 12, 2019
-
ఐపీఎల్లో ముంబయి ప్రత్యేకతలు
- నెగ్గిన ప్రతీ ఐపీఎల్ ఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసింది ముంబయి జట్టే. అన్ని సార్లూ లక్ష్యాన్ని కాపాడుకుంది.
- ముంబయి తను నెగ్గిన గత రెండు ఐపీఎల్ ఫైనల్లోనూ ఒక్క పరుగు తేడాతోనే విజయం సాధించింది.
- గెలిచిన నాలుగు ఫైనల్ మ్యాచ్‌ల్లో 2015 మినహా ప్రతీసారి టాస్ గెలిచింది ముంబయి జట్టే.
- చెన్నైతో నాలుగుసార్లు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ల్లో తలపడితే మూడు సార్లు విజయం సాధించింది ముంబయి. అలాగే ఈ సీజన్లో ఆ జట్టుతో ముఖాముఖి తలపడిన నాలుగు సార్లు రోహిత్‌సేనదే విజయం.
- ఐపీఎల్ ప్రారంభమైన దగ్గర నుంచి ఒక్కసారి మాత్రమే ముంబయి ఆటగాడు ఆరెంజ్ క్యాప్‌ను చేజిక్కించుకున్నాడు. 2010లో సచిన్ తెందూల్కర్(618 పరుగులు) ఈ ఘనత సాధించాడు.
- పర్పుల్ క్యాప్ కూడా ఒక్కసారే ముంబయి ఆటగాడు సొంతం చేసుకున్నాడు. 2011లో మలింగ(28 వికెట్లు) ఈ రికార్డు దక్కించుకున్నాడు.
- 2013 నుంచి సీజన్ తొలి మ్యాచ్‌లో ముంబయి ఒక్కసారి కూడా గెలవలేదు.