క్రికెటర్లు తమ కుటుంబసభ్యులకు సెంచరీలు అంకితమివ్వడం చాలా సార్లు చూశాం. కానీ ఈ మధ్య భార్యల కోసం అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడుతున్నారు ఆటగాళ్లు.
పెళ్లి రోజు, పుట్టిన రోజు వంటి రోజున మ్యాచ్ పడితే చెలరేగిపోతున్నారు. తాజాగా ముంబయి హిట్టర్ పొలార్డ్ తన భార్య 32వ జన్మదినోత్సవ కానుకగా పంజాబ్‌పై ఆడిన ఇన్నింగ్స్‌ను అంకితమిచ్చాడు.
ముంబయి, పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్.. గేల్ , రాహుల్ జోరుతో 197 పరుగుల భారీస్కోరు సాధించింది. తర్వాత ముంబయి తాత్కాలిక సారథి పొలార్డ్ (31 బంతుల్లో 83; 3 ఫోర్లు, 10 సిక్స్‌లు) విధ్వంసకర బ్యాటింగ్‌తో జట్టుకు విజయాన్నందించాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన పొలార్డ్ విజయాన్ని తన భార్యకు అంకితమిచ్చాడు.
- — ebianfeatures (@ebianfeatures) April 11, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
— ebianfeatures (@ebianfeatures) April 11, 2019
">— ebianfeatures (@ebianfeatures) April 11, 2019