ETV Bharat / sports

'మ్యాన్​ ఆఫ్ ది మ్యాచ్​' నాకు కాదు.. అతడికివ్వాలి - ఐపీఎల్ తాజా వార్తలు

చెన్నైై సూపర్​కింగ్స్​పై విజయంలో కీలక పాత్ర పోషించిన బౌలర్ రాహుల్​కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చుండాల్సిందని అభిప్రాయపడ్డాడు రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు సంజూ శాంసన్.

MOM Samson feels Rahul Tewatia 'should have been Man of the Match' vs CSK
Samson feels Rahul Tewatia
author img

By

Published : Sep 23, 2020, 12:13 PM IST

Updated : Sep 25, 2020, 6:00 PM IST

మంగళవారం జరిగిన మ్యాచ్​లో చెన్నైపై రాజస్థాన్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు సంజూ శాంసన్. 32 బంతుల్లో 72 పరుగులు చేసి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'​గా నిలిచాడు. అయితే ఇది తన కంటే బౌలర్ రాహుల్​ తెవాటియాకు ఇచ్చుంటే బాగుండేది.

MOM Samson feels Rahul Tewatia 'should have been Man of the Match' vs CSK
చెన్నై-రాజస్థాన్ మ్యాచ్​లో రాహుల్ తెవాటియా

"రాత్రి మంచు పడుతూ ఉంటుంది. అప్పుడు బౌలింగ్ చేయడం కష్టం. అలాంటి సమయంలోనూ రాహుల్ మూడు కీలక వికెట్లు తీశాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్​ అతడికిస్తేనే బాగుండేది. నా వరకైతే గేమ్​ను మార్చింది రాహుల్ తెవాటియానే" -సంజూ శాంసన్, రాజస్థాన్ బ్యాట్స్​మన్

ఈ మ్యాచ్​లో 16 పరుగుల తేడాతో రాజస్థాన్.. ప్రస్తుత సీజన్​లో తొలి విజయం నమోదు చేసింది. సంజుకు తోడుగా కెప్టెన్ స్మిత్ 69 పరుగులతో రాణించాడు. సీఎస్కేలో డుప్లెసిస్(72) మినహా మిగతా అందరూ నామమాత్రంగానే ఆడారు. సెప్టెంబరు 25న దిల్లీతో చెన్నై తర్వాతి మ్యాచ్​ ఆడనుండగా, సెప్టెంబరు 27న పంజాబ్​తో తలపడనుంది రాజస్థాన్.

Last Updated : Sep 25, 2020, 6:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.