హ్యాట్రిక్ విజయాలతో మళ్లీ ప్లేఆఫ్స్‌పై ఆశలు పెట్టుకుంటోంది బెంగళూరు. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో బుధవారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను 17 పరుగుల తేడాతో ఓడించింది ఆర్సీబీ జట్టు.
-
#ENDofGAME #TogetherWeRise #ChallengeAccepted #PlayBold pic.twitter.com/jeD0rQexxh
— Royal Challengers (@RCBTweets) April 24, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">#ENDofGAME #TogetherWeRise #ChallengeAccepted #PlayBold pic.twitter.com/jeD0rQexxh
— Royal Challengers (@RCBTweets) April 24, 2019#ENDofGAME #TogetherWeRise #ChallengeAccepted #PlayBold pic.twitter.com/jeD0rQexxh
— Royal Challengers (@RCBTweets) April 24, 2019
"తొలి ఆరు మ్యాచ్‌ల్లో ఓడిపోవడం జట్టును బాధించింది. కానీ ఆటగాళ్లు ఒత్తిడిలో కుంగిపోలేదు. ఫలితమేదైనా ఆటను ఆస్వాదించాలని నిర్ణయించుకున్నాం. జట్టుగా ఆడితే మంచి ఫలితాలు వస్తాయన్నదే మా నమ్మకం. చివరగా ఆడిన ఐదు ఆటల్లో నాలుగు విజయం సాధించాం. ఆ ఒక్కటీ గెలిస్తే మాకు మరింత మెరుగైన అవకాశం ఉండేది"
-- కోహ్లీ, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ సారథి
175 పరుగుల లక్ష్యం పంజాబ్ ముందుంచితే చాలు అనుకున్న సమయంలో... స్టొయినీస్, డివిలియర్స్ చెలరేగి 200 పరుగులు అందించారు. వారు అద్భుత ఆటగాళ్లు అంటూ ప్రశంసలు కురిపించాడు.
-
.@RCBTweets move up a position with 4 wins in their last 5 games 🔥#RCBvKXIP pic.twitter.com/7mq02WNtQJ
— IndianPremierLeague (@IPL) April 24, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">.@RCBTweets move up a position with 4 wins in their last 5 games 🔥#RCBvKXIP pic.twitter.com/7mq02WNtQJ
— IndianPremierLeague (@IPL) April 24, 2019.@RCBTweets move up a position with 4 wins in their last 5 games 🔥#RCBvKXIP pic.twitter.com/7mq02WNtQJ
— IndianPremierLeague (@IPL) April 24, 2019
ఈ మ్యాచ్ గెలవడం వల్ల సీజన్లో తొలిసారి పాయింట్ల పట్టికలో అడుగు ముందుకు వేసింది బెంగళూరు. రాజస్థాన్‌ను వెనక్కి నెట్టి ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఆర్సీబీ ప్లేఆఫ్స్ బరిలో నిలవాలంటే.. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో తప్పకుండా గెలవాలి. తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 28న దిల్లీ క్యాపిటల్స్‌తో ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో తలపడనుంది కోహ్లీ సేన.