గురువారం బెంగళూరు వేదికగా ముంబయితో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ కెప్టెన్ కోహ్లీ మరో రికార్డు నెలకొల్పాడు. 46 పరుగులు వ్యక్తిగత స్కోరు వద్ద... ఐపీఎల్లో 5000 పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. వారం క్రితమే సురేశ్ రైనా ఈ ఘనత సాధించాడు.
రైనా 177 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధిస్తే, కేవలం 165 మ్యాచ్‌ల్లోనే ఈ స్కోరు చేసి అరుదైన రికార్డు నెలకొల్పాడు విరాట్ కోహ్లీ.
ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభమయ్యే నాటికి 4948 పరుగులతో ఉన్నాడు. చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్‌లోనే కోహ్లీ ఈ రికార్డు సాధించేవాడు. కానీ 6 పరుగులే చేసి ఔటయ్యాడు. అదే మ్యాచ్‌లో చెన్నై బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా... 5000 పరుగుల చేసి ఈ ఘనతను సాధించిన మొదటి ఆటగాడిగా నిలిచాడు.