ETV Bharat / sports

కుంబ్లే సూచనల వల్లే మెరుగయ్యా: బిష్ణోయ్ - అనిల్​ కుంబ్లే వార్తలు

రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరుతో జరిగిన మ్యాచ్​లో ప్రణాళిక ప్రకారమే ప్రదర్శన చేశామని అంటున్నాడు కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ స్పిన్నర్​ రవి బిష్ణోయ్​. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి కోచ్​ అనిల్​ కుంబ్లే సలహాలు, సూచనలు ఎంతగానో ఉపయోగపడ్డాయని మ్యాచ్​ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించాడు.

IPL 2020: Ravi Bishnoi reveals Anil Kumble's advice for him
'కోచ్​ అనిల్​ కుంబ్లే సూచనలు నాకు సహాయపడ్డాయి'
author img

By

Published : Sep 25, 2020, 11:20 AM IST

Updated : Sep 25, 2020, 6:00 PM IST

కింగ్స్ ఎలెవన్​ పంజాబ్​ కోచ్​ అనిల్​ కుంబ్లే తమకు ప్రశాంతమైన వాతావరణంలో నైపుణ్యాలను నేర్పించాడని తెలిపాడు ఆ జట్టు స్పిన్నర్​ రవి బిష్ణోయ్​. అలాంటి శిక్షణే తమకు ఎంతో ఉపయోగపడిందని గురువారం మ్యాచ్​ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించాడు​.

"అనిల్​ కుంబ్లే మాకు ప్రశాంత ధోరణితో ఎలా ఆడాలో నేర్పించాడు. టోర్నీ ప్రారంభానికి ముందే మేము బాగా ప్రాక్టీసు చేశాం. మానసిక ఒత్తిడిని జయించడం సహా లూజ్​ బాల్స్​ను నియంత్రణ చేయడంపై ఎక్కువ దృష్టి సారించాం. జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన కేఎల్​ రాహుల్​ ఒక క్లాస్​ బ్యాట్స్​మన్​. తను కొట్టే షాట్లను ఎవ్వరికైనా పదే పదే చూడాలనిపిస్తుంది. ప్రణాళిక ప్రకారమే మ్యాచ్​లో ప్రదర్శన చేశాం. చాహల్​ను ఎలా ఎదుర్కోవాలనే దానిపై గేమ్​ప్లాన్​ అంటూ ఏమీ రూపొందించలేదు".

- రవి బిష్ణోయ్​, కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ స్పిన్నర్​

పంజాబ్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో గురువారం జరిగిన మ్యాచ్​లో బెంగళూరును చిత్తు చిత్తుగా ఓడించింది. తొలుత కేఎల్‌ రాహుల్‌ ‌(132 నాటౌట్‌; 69 బంతుల్లో 14x4, 7x6) భారీ శతకంతో చెలరేగడం వల్ల 206 పరుగుల భారీ స్కోర్ సాధించింది పంజాబ్. అనంతరం రవి బిష్ణోయ్‌(3), మురుగన్‌ అశ్విన్‌(3), షెల్డన్‌ కాట్రెల్‌(2) చెలరేగడం వల్ల బెంగళూరు 109 పరుగులకే ఆలౌటైంది.

IPL 2020: Ravi Bishnoi reveals Anil Kumble's advice for him
కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ వర్సెస్​ రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు

Last Updated : Sep 25, 2020, 6:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.