130 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌కు ఓపెనర్లు శుభారంభం అందించారు. కొట్టాల్సింది తక్కువే అయినా బెయిర్ స్టో 28 బంతుల్లో 48 పరుగులతో (9 ఫోర్లు, ఒక సిక్స్) చెలరేగిపోయాడు. ఇందులో 42 రన్స్ బౌండరీల ద్వారా వచ్చినవే. మరో ఎండ్‌లో వార్నర్ చక్కటి సహకారం అందించాడు. చివర్లో వెంటవెంటనే వికెట్లు పడినా.. నబీ 9 బంతుల్లో 17 పరుగులతో వేగంగా ఆడి జట్టుకు విజయాన్నందించాడు.
ఈ గెలుపుతో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది సన్‌రైజర్స్. అంతకుముందురాజస్థాన్, బెంగళూరులపై విజయాలను నమోదు చేసింది భువీ సేన. ఫలితంగా... 4 మ్యాచుల్లో 3 విజయాలతోపాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి చేరింది.
That's that from Delhi as the @SunRisers win by 5 wickets 👏👏#VIVOIPL pic.twitter.com/pNKcVxwZkv
— IndianPremierLeague (@IPL) April 4, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">That's that from Delhi as the @SunRisers win by 5 wickets 👏👏#VIVOIPL pic.twitter.com/pNKcVxwZkv
— IndianPremierLeague (@IPL) April 4, 2019That's that from Delhi as the @SunRisers win by 5 wickets 👏👏#VIVOIPL pic.twitter.com/pNKcVxwZkv
— IndianPremierLeague (@IPL) April 4, 2019
అద్భుత భాగస్వామ్యం...
ఈ సీజన్లో ఒక్కసారీ పవర్ ప్లేలో వికెట్ కోల్పోని రికార్డున్న హైదరాబాద్...ఈ మ్యాచ్‌లోనూ అదే ఊపు కొనసాగించింది. ఓపెనర్లు బెయిర్ స్టో, వార్నర్ వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
అయితే బెయిర్ స్టో క్యాచ్‌లను రెండు సార్లు నేల విడిచారు దిల్లీ ఫీల్డర్లు. కాని చివరికి అర్ధశతకం చేయకుండానే 48 పరుగుల వద్ద ఔటయ్యాడు బెయిర్ స్టో.
దిల్లీ బౌలర్లందరూ హైదరాబాద్ బ్యాట్స్మెన్ల దూకుడు ముందు తేలిపోయారు. పరుగులు నియంత్రించడంలో విఫలమయ్యారు.
- క్యూ కట్టేశారు...
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన దిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 129 పరుగులకే పరిమితమైంది. రెండు ఫోర్లు కొట్టి మంచి ఆరంభాన్నిచ్చిన పృథ్వీషా 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. వెంటనే శిఖర్ ధావన్ (12), పంత్ (5), రాహుల్ తెవాటియా(5), ఇంగ్రామ్ (5), మోరిస్ (17) తక్కువ పరుగులకే ఔట్ కావడంతో స్కోరు మందగించింది. చివర్లో అక్షర్ పటేల్ 17 పరుగుల చేయడంతో ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది.
- కెప్టెన్ ఇన్నింగ్స్..
మంచి బ్యాటింగ్ లైనప్గా పేరున్న దిల్లీ జట్టును.. సన్‌రైజర్స్ స్పిన్నర్లు నియంత్రించారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 41 బంతుల్లో 43 పరుగులు చేసి జట్టుకు పోరాడే స్కోరునందించాడు.
హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేశారు. భువనేశ్వర్, నబీ, కౌల్ చెరో రెండేసి వికెట్లు తీశారు. రషీద్ ఖాన్, సందీప్ తలో వికెట్ తీసుకున్నారు. రషీద్ ఖాన్ 4 ఓవర్లకు 18 పరుగులిచ్చి పొదుపుగా బౌలింగ్ చేశాడు.