2013, ఏప్రిల్ 23...రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పూణే వారియర్స్ జట్ల మధ్య మ్యాచ్. విండీస్ వీరుడు క్రిస్‌గేల్ తన ప్రతాపం చూపించాడు. ఎంతలా అంటే ఐపీఎల్లో రికార్డులు చెరిగిపోయాలా. ఈ మ్యాచ్‌లో గేల్ 30 బంతుల్లో శతకం (11 సిక్సర్లు, 8 ఫోర్లు) బాది...ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన శతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. అంతకు ముందు 2010లో ఉన్న యూసఫ్ పఠాన్ 37 బంతుల్లో శతకం రికార్డును బద్ధలు కొట్టాడు.
మ్యాచ్‌లో 66 బంతుల్లో 175 పరుగులతో పూణె బౌలర్లకు చుక్కలు చూపించిన ఈ హిట్టర్...ఆర్సీబీ ఆటగాడు మెక్కల్లమ్ పేరిట ఉన్న 158 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరు ను వెనక్కినెట్టాడు.
-
#OnThisDay in 2013, Chris Gayle smashed the:
— ESPNcricinfo (@ESPNcricinfo) April 23, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
- Fastest T20 hundred (30 balls)
- Highest T20 scorehttps://t.co/40Z2UZgrBj
Who's going to break these records? 🤔 pic.twitter.com/rRHJJmGtae
">#OnThisDay in 2013, Chris Gayle smashed the:
— ESPNcricinfo (@ESPNcricinfo) April 23, 2019
- Fastest T20 hundred (30 balls)
- Highest T20 scorehttps://t.co/40Z2UZgrBj
Who's going to break these records? 🤔 pic.twitter.com/rRHJJmGtae#OnThisDay in 2013, Chris Gayle smashed the:
— ESPNcricinfo (@ESPNcricinfo) April 23, 2019
- Fastest T20 hundred (30 balls)
- Highest T20 scorehttps://t.co/40Z2UZgrBj
Who's going to break these records? 🤔 pic.twitter.com/rRHJJmGtae
ఆర్సీబీ ఇచ్చిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ప్రత్యర్థి పుణె...కనీసం గేల్ చేసిన స్కోరును కూడా చేయలేక 133 పరుగులకే చతికిలపడింది.
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 12వ సీజన్లోనూ 9 మ్యాచుల్లో 421 పరుగులతో అదరగొడుతున్నాడు క్రిస్ గేల్.