ఫిరోజ్‌షా కోట్లా వేదికగా జరిగిన మ్యాచ్‌లో 16 పరుగుల తేడాతో దిల్లీ గెలిచింది. నిర్దేశించిన 188 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు ఛేదించలేక 170 కే పరిమితమైంది. క్యాపిటల్స్ జట్టులో శ్రేయస్, ధావన్.. అర్ధశతకాలతో రాణించారు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో దిల్లీ అగ్రస్థానానికి చేరుకుని ఫ్లేఆఫ్‌కు అర్హత సాధించింది. 2012 తర్వాత దిల్లీ.. ఫ్లేఆఫ్స్‌కు చేరింది ఇప్పుడే.
-
That's that from Delhi as the @DelhiCapitals win by 16 runs and are through to the Playoffs 😎💪 pic.twitter.com/KtxeYqEwUY
— IndianPremierLeague (@IPL) April 28, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">That's that from Delhi as the @DelhiCapitals win by 16 runs and are through to the Playoffs 😎💪 pic.twitter.com/KtxeYqEwUY
— IndianPremierLeague (@IPL) April 28, 2019That's that from Delhi as the @DelhiCapitals win by 16 runs and are through to the Playoffs 😎💪 pic.twitter.com/KtxeYqEwUY
— IndianPremierLeague (@IPL) April 28, 2019
-
The @DelhiCapitals have now claimed the top spot in the #VIVOIPL Points Table. Will the @mipaltan join #CSK and #DC for the playoffs tonight? pic.twitter.com/o6yH32XHCI
— IndianPremierLeague (@IPL) April 28, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">The @DelhiCapitals have now claimed the top spot in the #VIVOIPL Points Table. Will the @mipaltan join #CSK and #DC for the playoffs tonight? pic.twitter.com/o6yH32XHCI
— IndianPremierLeague (@IPL) April 28, 2019The @DelhiCapitals have now claimed the top spot in the #VIVOIPL Points Table. Will the @mipaltan join #CSK and #DC for the playoffs tonight? pic.twitter.com/o6yH32XHCI
— IndianPremierLeague (@IPL) April 28, 2019
ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది దిల్లీ క్యాపిటల్స్. ఓపెనర్లిద్దరూ తొలి వికెట్‌కు 35 పరుగులు జోడించారు. అనంతరం 18 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పృథ్వీషా ఔటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్.. మరో ఓపెనర్ ధావన్‌తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఆ క్రమంలోనే వీరిద్దరూ అర్ధ సెంచరీలు చేశారు. రెండో వికెట్‌కు 68 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
ధావన్ 50, అయ్యర్ 52 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టారు. చివర్లో వచ్చిన రూథర్‌ఫర్డ్ 28, అక్షర్ పటేల్ 16 ధాటిగా ఆడి జట్టు స్కోరు 187 పరుగులు చేయడంలో సహాయపడ్డారు. మిగతా బ్యాట్స్‌మెన్‌లో పంత్ 7, ఇంగ్రామ్ 11 రన్స్ చేశారు.
బెంగళూరు బౌలర్లలో చాహల్ రెండు వికెట్లు తీశాడు. సైనీ, ఉమేశ్, సుందర్ తలో వికెట్ తీశారు.
అనంతరం 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. తొలి వికెట్‌కు పార్థివ్- కోహ్లీ జోడి 63 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. పార్థివ్ 39 పరుగులు చేసి మొదటి వికెట్‌గా వెనుదిరిగాడు. తర్వాత 23 పరుగులు చేసి కోహ్లీ ఔటయ్యాడు.
మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయారు. డివిలియర్స్ 17, శివమ్ దూబే 24, క్లాసీన్ 3, సుందర్ 1, గురుకీరత్ సింగ్ 27 పరుగులు చేసి వెనుదిరిగారు. చివరి వరుకు నిలిచి 32 పరుగులు చేసిన స్టాయినిస్ జట్టును గెలిపించలేకపోయాడు.
దిల్లీ బౌలర్లలో రబాడా, మిశ్రా తలో రెండు వికెట్లు తీశారు. ఇషాంత్, అక్షర్ పటేల్, రూథర్‌ఫర్డ్ తలో వికెట్ పడగొట్టారు.