ETV Bharat / sports

తడిబడిన చెన్నై.. రైజర్స్​​ విజయలక్ష్యం 133

author img

By

Published : Apr 17, 2019, 10:07 PM IST

హైదరాబాద్​ వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై తక్కువ స్కోరుకే పరిమితమైంది. 20 ఓవర్లకు చెన్నై సూపర్‌ కింగ్స్‌ 5 వికెట్లు కోల్పోయి 132 పరుగులు మాత్రమే చేయగలిగింది.

తడిబడిన చెన్నై...సన్​రైజర్స్​ విజయలక్ష్యం 133

సన్​రైజర్స్​తో జరుగుతున్న మ్యాచ్​లో చెన్నై సూపర్​కింగ్స్​ 132 పరుగులు చేసింది. ఓపెనర్లు మంచి ఆరంభం ఇచ్చినా మిడిలార్డర్​ దారుణంగా విఫలమైంది. షేన్​ వాట్సన్​ (31; 29 బంతుల్లో 4ఫోర్లు), డుప్లెసిస్‌ (45; 31 బంతుల్లో 3ఫోర్లు, 3 సిక్సులు) దూకుడుగా ఆడారు. వీరిద్దరూ ఈ ఏడాది చెన్నై తరఫున అత్యధిక ఓపెనింగ్‌ భాగస్వామ్యం (79) నెలకొల్పారు. నదీమ్‌ బౌలింగ్​లో వాట్సన్​ ఔటైన తరువాత ఇన్నింగ్స్​ మలుపు తిరిగింది.

మిడిలార్డర్​ వైఫల్యం...

చెన్నై మిడిలార్డర్​ హైదరాబాద్​ బౌలింగ్​కు కుప్పకూలింది. సురేశ్‌ రైనా (13; 13 బంతుల్లో 2×4), కేదార్‌ జాదవ్‌ (1; 2 బంతుల్లో) తక్కువకే ఔటవ్వడంతో భారీ స్కోరు చేయలేక చతికిలపడింది సూపర్​కింగ్స్​. ధోని స్థానంలో జట్టులోకొచ్చిన సామ్‌ బిల్లింగ్స్‌ డకౌటై నిరాశపరిచాడు. జడేజా 20 బంతులాడి 10 పరుగులు మాత్రమే చేశాడు.

హైదరాబాద్​ బౌలర్లలో రషీద్​ 2 వికెట్లు తీశాడు. ఖలీల్​, నదీమ్​, విజయ్​ శంకర్​ తలో వికెట్​ తీశారు.

సన్​రైజర్స్​కు మద్దతుగా ప్రముఖ టెన్నిస్​ క్రీడాకారిణి సానియా మీర్జా మ్యాచ్​ను ప్రత్యక్షంగా తిలకించింది.

Viral Advisory
Wednesday 17th April 2019
Please note the following addition to SNTV's output on Wednesday 17th April 2019
VIRAL (SOCCER): A violent kick to the stomach overshadowed PSM Makassar's 2-1 AFC Cup win at Kaya on Wednesday. Jalsor Soriano was sent off for a vicious attack on PSM's Dutch midfielder Marc Anthony Klok in the 88th minute. Already moved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.