సొంతగడ్డపై జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ 202 పరుగుల భారీ స్కోరు సాధించింది. మిస్టర్ 360 డివిలియర్స్ చెలరేగి ఆడాడు. చివరి వరకు క్రీజులో నిలిచి 82 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఓపెనర్‌గా వచ్చిన పార్థివ్ పటేల్ 43 పరుగులతో మెరిశాడు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు శుభారంభం లభించలేదు. ఓ వైపు పార్థివ్ పటేల్ చెలరేగి ఆడగా... మరో ఎండ్‌లో ఉన్న కోహ్లి కేవలం 13 పరుగులే చేసి పెవిలియన్ బాట పట్టాడు. వన్‌డౌన్‌లో వచ్చిన డివిలియర్స్ స్కోరు బోర్డను నెమ్మదిగా పరుగులు పెట్టించాడు. దీంతో ఈ సీజన్లోనే పవర్ ప్లేలో రెండో అత్యధిక స్కోరు నమోదు చేసింది బెంగళూరు. 6 ఓవర్లు ముగిసే సరికి 70 పరుగులు చేశారు.
-
An outstanding ABD (82*) show and a quickfire 46* from Stoinis here in Bangalore, as the @RCBTweets post a mammoth total of 202/4 on board.
— IndianPremierLeague (@IPL) April 24, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Will the @lionsdenkxip chase this down? pic.twitter.com/gHpwI8cqkL
">An outstanding ABD (82*) show and a quickfire 46* from Stoinis here in Bangalore, as the @RCBTweets post a mammoth total of 202/4 on board.
— IndianPremierLeague (@IPL) April 24, 2019
Will the @lionsdenkxip chase this down? pic.twitter.com/gHpwI8cqkLAn outstanding ABD (82*) show and a quickfire 46* from Stoinis here in Bangalore, as the @RCBTweets post a mammoth total of 202/4 on board.
— IndianPremierLeague (@IPL) April 24, 2019
Will the @lionsdenkxip chase this down? pic.twitter.com/gHpwI8cqkL
అనంతరం 43 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మురుగన్ అశ్విన్ బౌలింగ్‌లో పార్థివ్ పెవిలియన్ బాటపట్టాడు. తర్వాత వచ్చిన అలీ 4, అక్షదీప్ నాథ్ 3 పరుగులు చేసి వెనుదిరిగారు. స్టాయినిస్ చివరి వరకు డివిలియర్స్‌కు అండగా నిలిచి 46 పరుగులతో రాణించాడు.
పంజాబ్ బౌలర్లలో షమి, మురుగన్ అశ్విన్, రవిచంద్రన్ అశ్విన్, విజెలిన్ తలో వికెట్ తీశారు.