ETV Bharat / sports

'పాక్​తో సిరీస్​ రద్దు.. ఆటగాళ్లను నిందించకండి' - పాకిస్థాన్​ న్యూజిలాండ్​ సిరీస్​

పాకిస్థాన్​తో పర్యటనను(NZ Vs PAK) రద్దు చేసుకున్నందుకు న్యూజిలాండ్​ క్రికెటర్లను నిందించడం సరికాదని కివీస్​ పేసర్​ మెక్లెనగన్​(Mitchell Mcclenaghan News) అంటున్నాడు. పాక్​ బ్యాట్స్​మన్​ హఫీజ్​ చేసిన ట్వీట్​కు మెక్లెనగన్​​ ఈ విధంగా బదులిచ్చాడు.

Mitchell McClenaghan Replies to Mohammad Hafeez: 'Don't Blame Kiwi Players'
'పాక్​తో సిరీస్​ రద్దు.. ఆటగాళ్లను నిందించకండి'
author img

By

Published : Sep 20, 2021, 9:04 AM IST

పాకిస్థాన్​ పర్యటనను రద్దు(NZ Vs PAK) చేసుకున్నందుకు న్యూజిలాండ్‌ క్రికెటర్లను నిందించడం సరికాదని కివీస్​ పేసర్​ మెక్లెనగన్​(Mitchell Mcclenaghan News) అంటున్నాడు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే తాము నడుచుకున్నామని తెలిపాడు.

"పాక్‌ నుంచి తిరిగి వెళ్లేందుకు సిద్ధమైన న్యూజిలాండ్‌ జట్టును సురక్షితంగా విమానాశ్రయానికి చేర్చిన పాకిస్థాన్‌ భద్రతా దళాలకు ధన్యవాదాలు. అదే దారి, అదే భద్రత.. మరి ఈ రోజు ప్రమాదం ఎందుకు జరగలేదు?" అని వ్యంగ్యంగా పాక్​ బ్యాట్స్​మన్​ హఫీజ్​ చేసిన ట్వీట్​కు మెక్లెనగన్​ సమాధానమిచ్చాడు.

"ఇలా అనడం సరికాదు. ఆటగాళ్లను లేదా క్రికెట్‌ సంఘాన్ని నిందించడం మానుకోవాలి. మా ప్రభుత్వాన్ని నిందించండి. వాళ్లకు అందిన సూచనల ప్రకారం ఆటగాళ్లు నడుచుకున్నారు. పాక్‌లో ఆడి సత్తాచాటాలని ఈ యువ ఆటగాళ్లు అనుకున్నారు. కానీ అవకాశం లేకుండా పోయింది."

- మెక్లెనగన్​, న్యూజిలాండ్​ పేసర్​

పాక్‌లో ప్రమాదం ఉందని తెలిసే..

తమ జట్టు ఆటగాళ్లకు తీవ్రమైన ప్రమాదం ఎదురయ్యే అవకాశం ఉందనే సూచనల నేపథ్యంలోనే సిరీస్‌ను రద్దు చేసుకుని(NZ Vs PAK Why Abandoned) పాకిస్థాన్‌ను వీడామని న్యూజిలాండ్‌ క్రికెట్‌ సీఈఓ డేవిడ్‌ వైట్‌ వెల్లడించాడు. శనివారం రాత్రి ఇస్లామాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరిన 84 మంది సభ్యుల న్యూజిలాండ్‌ బృందం దుబాయ్‌ చేరుకుంది. అక్కడ 24 గంటల ఐసోలేషన్‌ తర్వాత అందులో మంది వచ్చే వారం స్వదేశం చేరనున్నారు. శుక్రవారం తొలి వన్డే ఆరంభానికి కొన్ని నిమిషాల ముందు పర్యటనను రద్దు చేసుకుని పాక్‌ నుంచి వెళ్లిపోతున్నామని న్యూజిలాండ్‌ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.

"జట్టుకు ప్రమాదం ఉందని నిర్దిష్టమైన, విశ్వసనీయమైన సూచనలు మాకు అందాయి. దీంతో సిరీస్‌ రద్దు చేసుకోవాలనే నిర్ణయం తీసుకునే ముందు న్యూజిలాండ్‌ ప్రభుత్వ అధికారులతో చర్చించాం. మా పరిస్థితి గురించి పీసీబీకి చెప్పిన తర్వాత.. మా ప్రధానితో పాక్‌ ప్రధాని ఫోన్‌లో మాట్లాడారని తెలిసింది" అని డేవిడ్‌ పేర్కొన్నాడు.

ఇదీ చూడండి.. IPL 2021: కోల్​కతాతో ఆర్​సీబీ పోరు.. ట్రోఫీ రేసులో నిలిచేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.