కామెంటేటర్ అవతారం ఎత్తిన తర్వాత క్రికెటర్ దినేశ్ కార్తిక్(Dinesh Karthik commentary) రెట్టింపు ఉత్సాహంతో కనపడుతున్నాడు. ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమ్ఇండియా ఆటగాళ్లను ఒక్కొక్కొరిగా ఇంటర్వ్యూ చేస్తున్నాడు. తొలి టెస్టు సందర్భంగా విరాట్ కోహ్లీని ఇంటర్వ్యూ చేసిన డీకే.. అతడి జీవితంలోని అనేక ఆసక్తికర విషయాలను అభిమానులకు అందించాడు. ఇక ఇప్పుడు భారత డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మతో సంభాషించాడు.
లార్డ్స్ వేదికగా రెండో టెస్టు గురువారం ప్రారంభంకానుంది. దీనికి ముందు.. రోహిత్‌ను ఇంటర్వ్యూ(Rohit Sharma news) చేశాడు డీకే. ఇందుకు సంబంధించిన స్నీక్ పీక్ ఒకటి.. తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నాడు. అందులో.. రోహిత్ పెళ్లి తర్వాత మారిపోయాడన్నాడు కార్తిక్.
"రితిక(Rohit Sharma wife)తో వివాహానికి ముందు రోహిత్ శర్మ 'సూర్యవంశం' సినిమా చూసిన ఏడ్చేసేవాడు. కానీ పెళ్లి తర్వాత.. రోహిత్ మారిపోయాడు. గేమ్ ఆఫ్ థ్రోన్స్, బ్రేకింగ్ బ్యాడ్ వంటి ఇంగ్లీష్ వెబ్ సిరీస్‌లు చూసేస్తున్నాడు" అని డీకే చెప్పగా.. రోహిత్ శర్మ నవ్వుతూ సమాధానమిచ్చాడు. "ఎవరు చెప్పారు నీకు ఇది? నిజమే.. చాలా మారింది" అంటూ సిగ్గుపడ్డాడు రోహిత్.
-
A sneak peek into the interview with @ImRo45. Will be out tomorrow during the 2nd #ENGvIND Test.
— DK (@DineshKarthik) August 11, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
P.S. Sorry Sham for revealing all those secrets about you 🤪 pic.twitter.com/wXQaADcbxk
">A sneak peek into the interview with @ImRo45. Will be out tomorrow during the 2nd #ENGvIND Test.
— DK (@DineshKarthik) August 11, 2021
P.S. Sorry Sham for revealing all those secrets about you 🤪 pic.twitter.com/wXQaADcbxkA sneak peek into the interview with @ImRo45. Will be out tomorrow during the 2nd #ENGvIND Test.
— DK (@DineshKarthik) August 11, 2021
P.S. Sorry Sham for revealing all those secrets about you 🤪 pic.twitter.com/wXQaADcbxk
ఇదీ చూడండి:- కోహ్లీకి ట్రోల్స్ బెడద.. ఇంగ్లాండ్ ప్రేక్షకుల అత్యుత్సాహం