ఎవరి జీవితంలోనైనా తల్లిది కీలకపాత్ర! పతకాలు, ట్రోఫీలు సాధించిన ఎంతోమంది క్రీడాకారుల విజయాల వెనుక ఉండేది వారి తల్లులే. వాళ్ల త్యాగాలకు ఏమి ఇచ్చినా తక్కువే! కానీ, భారత క్రికెట్(team india news) జట్టులోని ఆటగాళ్లు.. తమ అమ్మల కోసం ఓసారి విన్నూత్నంగా ఆలోచించి వారికి గౌరవాన్ని ఇచ్చారు. అమ్మలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఏం జరిగిందంటే?
2016లో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం న్యూజిలాండ్(ind vs nz) జట్టు భారత పర్యటనకు వచ్చింది. అందులో భాగంగా వైజాగ్ వేదికగా ఐదో వన్డే జరిగింది. ఈ మ్యాచ్లో తమ తల్లులకు కృతజ్ఞతాభావం తెలిపే విధంగా భారత క్రికెటర్లందరూ తమతమ మాతృమూర్తుల పేర్లు ఉన్న జెర్సీలను ధరించారు.
"మాతృమూర్తుల సహకారానికి కృతజ్ఞతాభావం చూపేందుకు ఇదొక మార్గం. ఇలా బహిరంగ వేదికపై తల్లుల పేర్లు ఉన్న జెర్సీలను ధరించడం మాకెంతో ఆనందంగా.. భావోద్వేగంగానూ ఉంది".
- మహేంద్రసింగ్ ధోనీ(dhoni age), అప్పటి టీమ్ఇండియా కెప్టెన్
భారత క్రికెట్ నియంత్రణ మండలి(bcci news)తో కలసి స్టార్ ఇండియా చేపట్టిన మహిళల సాధికారిత ప్రచార కార్యక్రమంలో భాగంగా టీమ్ఇండియా క్రికెటర్లు తల్లి పేరుతో ఉన్న జెర్సీ ధరించారు. సామాజిక మార్పు కోసం ఓ టీమ్ జెర్సీని ఈ విధంగా ఉపయోగించడం ప్రపంచంలో ఇదే తొలిసారి!
ఇదీ చూడండి.. ఈ అమెరికా అథ్లెట్ చాలా హాట్ గురూ!