ETV Bharat / sports

టెస్టుల్లో లంకేయులపై టీమ్​ఇండియాదే హవా.. హిస్టరీ రిపీట్​ అవుతుందా?

author img

By

Published : Mar 2, 2022, 12:38 PM IST

IND VS SL: కెప్టెన్​ రోహిత్​ శర్మ సారథ్యంలో భారత్​ క్రికెట్​ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇటీవలే శ్రీలంకతో ఆడిన టీ20 సిరీస్​ను క్లీన్​ స్వీప్​ చేసింది. మార్చి 4న ప్రారంభం కానున్న టెస్టు సిరీస్​కు భారత జట్టు సన్నద్ధమవుతోంది. ఈ సిరీస్​తో రోహిత్​ శర్మ తొలిసారిగా టెస్టు ఫార్మాట్​కు పూర్తిస్థాయి కెప్టెన్​గా బాధ్యతలు చేపట్టనున్నాడు. అయితే ఇప్పటివరకు భారత్​, శ్రీలంక జట్ల మధ్య జరిగిన టెస్టు మ్యాచులకు సంబంధించిన రికార్డులను ఓ సారి పరిశీలిద్దాం.

captains
india, srilanka

IND VS SL: భారత క్రికెట్​ జట్టు మార్చి 4 నుంచి శ్రీలంక టీమ్​తో టెస్టు సిరీస్​ ఆడనుంది. రోహిత్​ శర్మ ఈ సిరీస్​కు తొలిసారిగా పూర్తిస్థాయి టెస్టు కెప్టెన్​గా​ బాధ్యతలు నిర్వహించనున్నాడు. ఇటీవలే శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్​ను క్లీన్​స్వీప్​ చేసిన టీమ్​ఇండియా మంచి దూకుడుతో ఉంది. టెస్టు సిరీస్​లో కూడా ఫాంను కొనసాగించాలని భావిస్తోంది. అయితే ఇప్పటివరకు లంకేయులతో జరిగిన టెస్టు సిరీస్​లలో భారత్ ఎన్ని విజయాలు సాధించింది?. ఎక్కువ వికెట్లు ఓ బౌలర్​ పడగొట్టాడు? ద్వైపాక్షిక సిరీస్​లో అత్యధిక సెంచరీలు ఎవరు చేశారు? వంటి రికార్డులు ఓసారి చూద్దాం.

తొలిసారి 1982లో...

1982లో రెండు జట్లు ముఖాముఖిగా తొలి టెస్టు మ్యాచ్‌ ఆడాయి. ఇరు జట్ల మధ్య 1985లో మొదటి టెస్టు సిరీస్‌ జరిగింది. భారత్​, శ్రీలంక మధ్య మొత్తం 44 టెస్టు మ్యాచులు జరగ్గా... వాటిలో 20 మ్యాచులు టీమ్​ఇండియా గెలిచింది. శ్రీలంక కేవలం 7 మ్యాచుల్లో విజయం సాధించింది. మిగతా 17 మ్యాచులు డ్రాగా ముగిశాయి.

ఇక భారత్‌లో 20 మ్యాచు​లు జరగగా.. టీమ్‌ఇండియా 11 మ్యాచుల్లో విజయం సాధించింది. లంక ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. తొమ్మిది టెస్టులు డ్రాగా ముగియడం గమనార్హం. అయితే లంకలోనూ భారత్‌ ఆధిక్యత ప్రదర్శించింది. తొమ్మిది మ్యాచుల్లో టీమ్‌ఇండియా, ఏడింట్లో లంక గెలిచాయి. ఇక మరో ఎనిమిది టెస్టులు డ్రా అయ్యాయి. దీంతో ఈసారైనా భారత్‌లో ఒక్క మ్యాచ్‌లోనైనా గెలవాలని లంక ఆశిస్తోంది. అదేవిధంగా తొలిసారి పూర్తిస్థాయి టెస్టు కెప్టెన్ బాధ్యతులు చేపడుతున్న రోహిత్ శర్మ తన మార్క్‌ను చూపించాలని తహతహలాడుతున్నాడు. ఇప్పటికే వన్డే, టీ20లో కెప్టెన్​గా సక్సెస్‌ కావడంతో ఇప్పుడు దృష్టంతా లంకతో టెస్టులపైనే కేంద్రీకరించాడు.

రెండు జట్ల సిరీస్​లలో పలు రికార్డులు..

  • 1997లో జరిగిన టెస్టు మ్యాచ్​లో శ్రీలంక జట్టు అత్యధిక స్కోరు 952/6తో డిక్లేర్​ చేసింది.
  • 1990లో జరిగిన టెస్టు మ్యాచ్​లో శ్రీలంక అతి తక్కువ స్కోరుతో 82కు ఆలౌటైంది.
  • భారత స్టార్​ ఆటగాడు సచిన్​ తెందూల్కర్​ తన కెరీర్​ మొత్తంలో శ్రీలంకపై టెస్టు మ్యాచుల్లో 1995 పరుగులు సాధించాడు. ఇరు జట్ల సిరీస్​లలో ఇవే అత్యధికం
  • 1997లో సనత్ జయసూర్య చేసిన 340 పరుగులు.. ఒక ఆటగాడి అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నమోదైంది.
  • 2017-18లో జరిగిన టెస్ట్ సిరీస్​లో అత్యధికంగా విరాట్​ కోహ్లీ 610 పరుగులు చేశాడు.
  • భారత్​, శ్రీలంకల మధ్య జరిగిన మొత్తం టెస్టు మ్యాచుల్లో 115 సెంచరీలు నమోదయ్యాయి.
  • రెండు జట్ల మధ్య జరిగిన టెస్టు మ్యాచుల్లో అత్యధికంగా సచిన్​ తెందూల్కర్​ 9 సెంచరీలు, రాహుల్​ ద్రవిడ్​​ 9 అర్ధ సెంచరీలు చేశారు.
  • ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచుల్లో శ్రీలంక ఆటగాడు ముత్తయ్య మురళీధరన్​ అత్యధికంగా 105 వికెట్లను తీశాడు.
  • 2008లో జరిగిన టెస్టు సిరీస్​లో అత్యధికంగా అజంతా మెండిస్​ 26 వికెట్లు తీశాడు.
  • 2001లో ముత్తయ్య మురళీధరన్​ వేసిన బౌలింగ్ (8/87) ఒక్క ఇన్నింగ్స్​లో అత్యుత్తమ ప్రదర్శనగా నమోదైంది. ​
  • 2008లో ముత్తయ్య మురళీధరన్​ వేసిన బౌలింగ్ (11/110) ఒక్క మ్యాచ్​లో అత్యుత్తమ ప్రదర్శనగా నమోదైంది. ​
  • భారత్​, శ్రీలంక మధ్య జరిగిన మొత్తం టెస్టు మ్యాచుల్లో పది వికెట్ల ప్రదర్శన పది సార్లు జరిగింది.
  • భారత ఆటగాళ్లు హర్భజన్​ సింగ్​, అనిల్​ కుంబ్లే చెరో రెండు సార్లు 10 వికెట్ల ప్రదర్శన చేశారు.
  • రెండు జట్ల మధ్య జరిగిన టెస్టు మ్యాచుల్లో ఐదు వికెట్ల ప్రదర్శన 48 సార్లు జరిగింది.
  • శ్రీలంక ఆటగాడు ముత్తయ్య మురళీధరన్ అత్యధికంగా 7 సార్లు ఐదు వికెట్లు పడగొట్టాడు.
  • ధోని, వృద్ధిమాన్ సాహా, అమల్ సిల్వాలు చేసిన 22 ఔట్​లు..వికెట్ కీపర్​లు చేసిన అత్యధిక ఔట్లుగా రికార్డు నమోదయ్యాయి.
  • ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచుల్లో అత్యధికంగా అజారుద్దీన్​ 27 క్యాచ్​లు పట్టాడు.
  • ఒక సిరీస్​లో అత్యధికంగా క్యాచ్​లు పట్టిన ఆటగాళ్లుగా అజారుద్దీన్​, అజింక్య రహానె రికార్డు నమోదు చేశారు.

గతంలో జరిగిన మ్యాచుల్లో అత్యధిక స్కోరులు..

  • 1997 టెస్టు సిరీస్​లో జరిగిన మొదటి టెస్టు ఏడు రోజుల పాటు సాగింది. ఆ మ్యాచ్​లో శ్రీలంక జట్టు భారీ స్కోరు(952/6) సాధించింది. అయితే మ్యాచ్​ డ్రా అయింది. భారత ఆటగాళ్లు నవజ్యోత్​ సిద్ధు(111), సచిన్​ తెందూల్కర్​(143), మహమ్మద్​ అజారుద్దీన్​(126) పరుగులు చేశారు. బ్యాటింగ్​కు దిగిన శ్రీలంక ఆటగాళ్లు సనత్​ జయసూర్య(340), రోషన్​ మహనమ్​(225), అరవింద డిసిల్వ(126) పరుగులు చేశారు.
  • 2009 టెస్టు సిరీస్​..మొదటి మ్యాచ్​లో శ్రీలంక జట్టు 760/7 భారీ స్కోరు చేసింది. డ్రా అయిన ఈ మ్యాచ్​లో దిల్షాన్​(112), జయవర్ధనే(275), ప్రసన్న జయవర్ధనే(154), గంభీర్​(114), సచిన్​(100*) పరుగులు చేశారు.
  • 2009 ముంబయిలో జరిగిన టెస్టు మ్యాచ్​లో టీమ్​ఇండియా భారీ స్కోరు(726/7) చేసింది.
  • 2010 కొలంబోలో జరిగిన టెస్టు మ్యాచ్​లో భారత్​ జట్టు 707 పరుగులు చేసింది. ఈ మ్యాచ్​లో సచిన్​ 203 పరుగులు చేసి అదరగొట్టాడు.
  • 1986లో కాన్పుర్​లో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్​లో టీమ్​ఇండియా భారీ స్కోరు(676/7) చేసింది. ఈ మ్యాచ్​లో భారత ఆటగాళ్లు సునీల్​ గవాస్కర్​(176), మహమ్మద్​ అజారుద్దీన్​(199), కపిల్​ దేవ్​(163) పరుగులు చేశారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ మ్యాచ్​ మధ్యలోనే ముగిసింది.

ఇదీ చదవండి: అలా జరిగితే ప్రపంచకప్​ టీమ్​ఇండియాదే: మిథాలీ రాజ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.