ETV Bharat / sports

WTC Final: టీమ్ఇండియా లైనప్​పైనే అందరి దృష్టి

author img

By

Published : Jun 17, 2021, 10:25 AM IST

ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్​కు సర్వం సిద్ధమైంది. ఇరుజట్లు గెలుపుపై విశ్వాసంతో ఉన్నాయి. అయితే టీమ్​ఇండియాలో తుది పదకొండు మందిలో ఉండేది ఎవరు? ఎక్కువ అవకాశాలు ఎవరికీ ఉన్నాయి? తదితర విషయాలపై విశ్లేషణాత్మక కథనం.

TeamIndia
టీమ్ఇండియా

భారత్-న్యూజిలాండ్ మధ్య ప్రతిష్ఠాత్మక టెస్టు ఛాంపియన్​షిప్ ఫైనల్ శుక్రవారం(జూన్ 18) నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే రెండుజట్లూ ఈ మ్యాచ్ కోసం పూర్తిస్థాయిలో సిద్ధమయ్యాయి. అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటూ తొలి డబ్ల్యూటీసీ టైటిల్ గెలవాలన్న పట్టుదలతో ఉన్నాయి. ఐపీఎల్ తర్వాత ఏం మ్యాచ్​లు ఆడని కోహ్లీసేన.. కేవలం ప్రాక్టీస్​తోనే బరిలో దిగుతోంది. ఇప్పటికే ఇంగ్లాండ్​తో రెండు టెస్టులు ఆడి, సిరీస్​ గెలిచిన న్యూజిలాండ్..​ అక్కడి పరిస్థితులను అలవాటు చేసుకుని దూకుడు మీద ఉంది. ఏదేమైనా రెండు అగ్రజట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ అందరూ ఆసక్తిగా ఎదురుచూసేది మాత్రం తుదిజట్టులో ఎవరెవరు ఉంటారనే దానిపై? ఈ నేపథ్యంలో ఫైనల్​లో టీమ్ఇండియా తుదిజట్టుపై ఈటీవీ భారత్ అంచనా.

ఓపెనర్లుగా రోహిత్, గిల్

TeamIndia
రోహిత్, గిల్

భారత్.. ఇప్పటికే ఫైనల్ కోసం 15 మందితో జట్టును ప్రకటించింది. ఇందులో రోహిత్, గిల్ తప్ప మరెవరూ ఓపెనర్లు లేరు. దీంతో ఈ ఇద్దరి జోడీ దాదాపు ఖరారైపోయినట్లే! న్యూజిలాండ్​ బౌలర్లను ఎదుర్కొనేందుకు వీరిద్దరూ సిద్ధంగా ఉన్నారు.

మిడిలార్డర్​లో నో మార్పులు!

TeamIndia
కోహ్లీ, రహానే

మిడిలార్డర్​లో ఎలాంటి మార్పులు లేకుండానే టీమ్ఇండియా బరిలో దిగే అవకాశం ఉంది. పుజారా, కోహ్లీ, రహానే వరుసగా మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో ఆడతారు. టెస్టు క్రికెట్​లో ఈ ముగ్గురు భారత జట్టుకు వెన్నెముక అని చెప్పొచ్చు. ముఖ్యంగా విదేశీ పిచ్​లపై వీరి రికార్డులు మరిచిపోలేం. 15 మందితో కూడిన జట్టులో విహారికి అవకాశం దక్కినా.. తుది జట్టులో తీసుకునే అవకాశాలు చాలా తక్కువనే చెప్పాలి. అలాగే ఆస్ట్రేలియా పర్యటన నుంచి అదరగొడుతున్న వికెట్ కీపర్​ పంత్​కు సాహా కంటే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.

అశ్విన్,జడేజా రెడీ

TeamIndia
అశ్విన్, జడేజా

హార్దిక్ పాండ్య గైర్హాజరుతో అశ్విన్, జడేజా టీమ్ఇండియాకు ప్రధాన ఆల్​రౌండర్లుగా ఉండనున్నారు. స్వదేశంలో ఈ జోడీ భారత జట్టుకు ప్రధానాస్త్రమైనప్పటికీ SENA(సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో వీరిలో ఎవరికో ఒకరికి మాత్రమే అవకాశం దక్కుతూ వస్తోంది. కానీ సౌథాంప్టన్ పిచ్​పై బంతి కాస్త టర్న్ అయ్యే అవకాశాలు కనిపిస్తుండటం వల్ల వీరిద్దరూ తుదిజట్టులో ఉండొచ్చని భావిస్తున్నారు.

పేస్ దళం

TeamIndia
బుమ్రా, షమీ

మేనేజ్​మెంట్​కు పెద్ద తలనొప్పిగా మారిన సమస్య తుదిజట్టులో పేసర్లను ఎంపిక చేయడం. బుమ్రా, షమిలు కచ్చితంగా జట్టులో ఉంటారు. మిగిలిన ఒక్క స్థానానికి సిరాజ్, ఇషాంత్ పోటీపడుతున్నారు. ఇంగ్లాండ్​ పిచ్​లపై ఇషాంత్​కు ఎక్కువ అనుభవం ఉంది. అలాగే సిరాజ్​ ఆస్ట్రేలియా పర్యటనతో పాటు ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్​లోనూ అదరగొట్టాడు. దీంతో వీరిద్దరిలో ఒకరిని ఎంచుకోవడం జట్టుకు పెద్ద సమస్యగా మారింది.

టీమ్ఇండియా జట్టు అంచనా

రోహిత్ శర్మ, గిల్, పుజారా, కోహ్లీ, రహానే, పంత్, జడేజా, అశ్విన్, షమి, బుమ్రా, ఇషాంత్/సిరాజ్

ఇవీ చూడండి:WTC Final: ప్రశాంతమే కానీ ప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.