ETV Bharat / spiritual

అప్పుల బాధలు పోగొట్టే 'రుణ విమోచన' పూజ! మంగళవారం ఇలా చేస్తే మీ ప్రాబ్లమ్స్​ అన్నీ సాల్వ్!! - Runa Vimochana Puja on Tuesday - RUNA VIMOCHANA PUJA ON TUESDAY

Runa Vimochana Puja on Tuesday : ఆర్థిక బాధలు, అప్పుల బాధలు ఉంటే జీవితం నరకప్రాయమవుతుంది. ఒక్కోసారి ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్న వారికి కూడా రుణ బాధలు తప్పక పోవచ్చు. అప్పుల బాధ ఉంటే కొంత మందికి కంటి మీద కునుకు కూడా ఉండదు. రుణబాధలు పోగొట్టుకోవడానికి మానవ ప్రయత్నాలు ఎన్ని చేసినా ఒక్కోసారి భగవంతుని అనుగ్రహం కూడా అవసరం అవుతుంది. ఈ కథనంలో రుణబాధలు పోగొట్టుకోడానికి పాటించాల్సిన పరిహారాలను గురించి తెలుసుకుందాం.

Runa Vimochana Puja on Tuesday
Runa Vimochana Puja on Tuesday (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 23, 2024, 8:05 PM IST

Runa Vimochana Puja on Tuesday : వేమన కవి చెప్పినట్లుగా ఈ లోకంలో అప్పు లేని వాడే గొప్ప శ్రీమంతుడు. ఎందుకంటే అప్పు చేసి పంచభక్ష్య పరమాన్నాలు తినే కన్నా ఉన్నంతలో పచ్చడి మెతుకులు తిన్నా గొప్పే! ఒక్కోసారి అప్పు చేయక తప్పదు. కానీ ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ ఒక ప్రణాళిక ప్రకారం డబ్బు పొదుపు చేసుకుంటే సాధ్యమైనంత వరకు అప్పు చేసే అవసరం రాదు. ఒకవేళ గత్యంతరం లేక అప్పు చేసినా అది తీరే వరకు నిద్ర పోకూడదు. మనం నిద్రపోయినా మనం చేసిన అప్పు నిద్రపోదు. చాపకింద నీరులా వడ్డీతో కలిసి తడిసి మోపెడవుతుంది.

రుణ విముక్తి పరిహారాలు
సునాయాసంగా తీర్చేయవచ్చులే అని అప్పు చేసి చివరకు ఏవో కారణాల వల్ల అప్పు తీర్చలేక ఇబ్బందులు పడేవారు కొన్ని పరిహారాలు పాటిస్తే రుణబాధలు నుంచి బయటపడవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

హనుమంతుని ఆరాధన
రుణ విముక్తి కోసం మంగళవారం హనుమంతుని ఆలయాన్ని సందర్శించి మల్లెపూల నూనెతో దీపం వెలిగించి, ఆలయంలో ప్రశాంతంగా కూర్చుని హనుమాన్ చాలీసా పఠిస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి.

సింధూర పూజ
హనుమంతునికి సింధూరం అంటే ఏంటో ఇష్టం. హనుమంతుని ఆలయంలో మంగళవారం సింధూరంతో హనుమంతునికి అష్టోత్తర శతనామ పూజ చేయిస్తే రుణబాధలు నుంచి శాశ్వతంగా విముక్తి లభిస్తుంది.

తమలపాకుపై శ్రీరామ
హనుమంతుడు రామభక్తుడు. తీవ్రమైన రుణ బాధలు ఉన్నవారు మంగళవారం సింధూరంలో గంగాజలం కలిపి, అగరుబత్తీకి పత్తిని చుట్టి సింధూరంలో ముంచి తమలపాకుపై శ్రీరామ అని వ్రాయాలి. అలా 108 ఆకులపై వ్రాసి దానిని ఒక హారంలా చేసి ఆ మాలను ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమకు అలంకరించాలి. ఇలా 11 మంగళవారాలు చేస్తే హనుమ అనుగ్రహంతో రుణబాధలు నుంచి శాశ్వతంగా విముక్తి కలుగుతుంది.

అంగారక పూజ
మంగళవారానికి అధిపతి అంగారక గ్రహం. అందుకే మంగళవారం రోజు నవగ్రహాహలున్న ఆలయంలో అంగారకునికి ఎర్రని వస్త్రం సమర్పించి, ఎర్రని పూలతో పూజించాలి. అనంతరం బ్రాహ్మణునికి కందులు దానం ఇవ్వాలి. ఇలా అయిదు మంగళవారాలు చేస్తే అంగారకుని అనుగ్రహంతో రుణ బాధలు తొలగిపోతాయి.

రుణ విమోచన స్తోత్రం
మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రశాంతంగా కూర్చుని స్కాంద పురాణంలో వివరించిన రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని 11 సార్లు పారాయణ చేస్తే తీరని రుణాలు కూడా తీరిపోతాయి.

షణ్ముఖ పూజ
మంగళవారం అంగారక గ్రహానికి అధిపతియైన సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం జరిపిస్తే కూడా అప్పుల బాధలు తొలగిపోతాయి.

ఈ పరిహారాలు పాటించడం ద్వారా రుణ బాధలు నుంచి విముక్తి పొందుదాం. ఏది ఏమైనా రుణాలు చేసి బాధపడే కన్నా రుణాలు చేయకుండా ఉంటేనే మంచిది కదా!

జై శ్రీరామ్!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.