ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ వచ్చే నెల 18 నుంచి జరగనుంది. ఈ పోరులో టీమ్‌ఇండియా న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఇందుకోసం మే 25న యూకే చేరుకుని, ఎనిమిది రోజుల పాటు భారత ఆటగాళ్లంతా బయోబుడగలో ఉంటారు. జూన్ 2న ఇంగ్లాండ్‌కు చేరుకుని అక్కడ మరో పది రోజులు క్వారంటైన్‌లో ఉంటారు. అయితే ఈ పది రోజుల క్వారంటైన్‌ను కుదించాలని బోర్డు యోచిస్తున్నట్లు ఓ బీసీసీఐ అధికారి చెప్పారు. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయని అన్నారు.
ప్లేయర్ల కుటుంబాలకు అనుమతి
ప్రపంచటెస్టు ఛాంపియన్ షిప్(జూన్ 18-22), ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్(ఆగస్టు 4-సెప్టెంబరు 14) కోసం కఠిన ఆంక్షల నడుమ ఆటగాళ్లు దాదాపు మూడున్నర నెలలు ఇంగ్లాండ్‌లోనే ఉండనున్నారు. ఈ నేపథ్యంలో బయోబబుల్ వల్ల వారు మానసిక కంగుబాటుకు గురవ్వకుండా ఉండేందుకు వారి కుటుంబసభ్యులను పర్యటనకు అనుమతిచ్చే విషయమై పరిశీలిస్తున్నట్లు బోర్డు అధికారి తెలిపారు.
ఇదీ చూడండి: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌కు బీసీసీఐ ప్రణాళిక