ETV Bharat / sports

T20 Worldcup: 'అలా చేస్తేనే టీమ్​ఇండియా గెలుస్తుంది'

టీ20 ప్రపంచప్​లో(T20 World Cup 2021) విజయం సాధించాలంటే భారత ఆటగాళ్లు మానసికంగా ధైర్యంతో ఉండాలని అన్నాడు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ. అయితే కప్​పై ముందు నుంచే ఆలోచించకుండా ప్రతీ మ్యాచ్​పై దృష్టి సారిస్తూ ఆడాలని సూచించాడు.

BCCI, ganguly
బీసీసీఐ, గంగూలీ
author img

By

Published : Oct 16, 2021, 8:15 PM IST

టీ20 ప్రపంచకప్(T20 World Cup 2021)​ గెలిచేందుకు కోహ్లీసేనకు కావాల్సినంత ప్రతిభ​ ఉందని అభిప్రాయపడ్డాడు బీసీసీఐ అధ్యక్షుడు, టీమ్​ఇండియా మాజీ సారథి గంగూలీ(Sourav Ganguly on Team India). ఈ మెగా టోర్నీలో భారత ఆటగాళ్లు తెలివి ప్రదర్శించాలని సూచించాడు. అక్టోబర్ 24న పాకిస్థాన్​తో టీమ్​ఇండియా తొలి మ్యాచ్​ ఆడనున్న నేపథ్యంలో దాదా ఈ వ్యాఖ్యలు చేశారు.

"టోర్నీలో అడుగుపెట్టినంత మాత్రాన ఛాంపియన్​ అవ్వలేరు. తెలివి ప్రదర్శించి ఆడాల్సి ఉంటుంది. అలా చేస్తేనే కప్పు గెలుస్తారు. టీమ్​ఇండియాలో ఆటగాళ్లందరికీ మంచి స్కోరు నమోదు చేసి వికెట్లు తీసే సామర్థ్యం ఉంది. మానసికంగా వారు ధైర్యంతో ఉంటే చాలు టీమ్​ఇండియా ప్రపంచకప్​ గెలుస్తుంది."

--సౌరవ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు.

టీమ్​ఇండియా ప్రతీ మ్యాచ్​ జాగ్రత్తగా ఆడాలని సూచించాడు గంగూలీ(Ganguly News). ముందు నుంచే టైటిల్​ కోసం ఆలోచించడం కాకుండా ప్రతి మ్యాచ్​పై ఫోకస్​ చేయాలని అన్నాడు. 'గేమ్​ కే దీవానే' ప్లాట్​ఫామ్​ ప్రారంభోత్సవంలో దాదా ఈ వ్యాఖ్యలు చేశాడు. షార్జాలో మాత్రమే తక్కువ స్కోరు నమోదయ్యే అవకాశముందని, మిగతా స్టేడియాల్లో భారీగా స్కోరు నమోదవుతుందని అభిప్రాయపడ్డాడు.

ఇదీ చదవండి:

T20 World Cup 2021: మెగా టోర్నీలో భారత జట్టుదే పైచేయి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.