భారత టీ20 లీగ్ 2023 సీజన్ కోసం డిసెంబర్ 23న కొచ్చి వేదికగా మినీ వేలం నిర్వహించనున్నారు. ఫ్రాంచైజీలు తాము రిలీజ్ చేయాలనుకున్న ఆటగాళ్ల జాబితాను నవంబర్ 15లోపు సమర్పించాలని బీసీసీఐ సూచించింది. దీంతో ఫ్రాంచైజీలు తాము వదిలేసుకుంటున్న ప్లేయర్స్ లిస్టును ప్రకటిస్తున్నాయి.
భారత టీ20 లీగ్‌లో రికార్డు స్థాయిలో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబయి జట్టు.. 2023 సీజన్‌కి ముందు కీలక ఆటగాడిని వదులుకున్నట్లు తెలుస్తోంది. 2010 నుంచి జట్టులో ఉన్న ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్‌ని ముంబయి ఫ్రాంచైజీ రిలీజ్ చేసిందని సమాచారం. ఫాబియాన్ అలెన్, టైమల్ మిల్స్, మయాంక్ మార్కండే, హృతిక్ షోకిన్‌లను కూడా ముంబయి వదులుకున్నట్లు తెలుస్తోంది.
2022లో బెంగళూరు జట్టుకు ఆడిన ఆస్ట్రేలియా పేసర్ జేసన్ బెహ్రెన్‌డార్ఫ్‌ను వచ్చే సీజన్ కోసం ముంబయి జట్టులో చేర్చుకుంది. ఇక, చెన్నైజట్టు క్రిస్ జోర్డాన్, ఆడమ్ మిల్నే, నారాయణ్ జగదీష్, మిచెల్ శాంటర్న్‌లను రిలీజ్ చేసినట్లు సమాచారం. ఈ ఏడాది జరిగిన భారత టీ20 లీగ్‌లో ముంబయి పేలవ ప్రదర్శన చేసింది. 14 మ్యాచ్‌ల్లో ఆడి నాలుగింటిలో మాత్రమే విజయం సాధించింది.
గతంలో ఎన్నో మ్యాచ్‌లు ఒంటిచేత్తో గెలిపించిన పొలార్డ్ ఈ ఏడాది ఘోరంగా విఫలమయ్యాడు. 11 మ్యాచ్‌లు ఆడి 144 పరుగులే చేశాడు. ఈ సీజన్‌లో అతడి అత్యధిక స్కోరు 25 మాత్రమే. బహుశా ఈ కారణంతోనే అతడిని జట్టు నుంచి రిలీజ్ చేసినట్లు క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి:'బాబర్ ఇంకా నేర్చుకోవాలి.. ఫైనల్లో ఇంగ్లాండ్‌దే పైచేయి'.. పాక్ మాజీ కెప్టెన్ కామెంట్స్