ETV Bharat / sports

Virat Kohli Form: ఫామ్​లోనే కోహ్లీ.. కానీ: సునీల్ గావస్కర్

Virat Kohli Form: టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ విరాట్‌ కోహ్లీపై సునీల్‌ గావస్కర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడు ఫామ్‌లోనే ఉన్నాడని.. కానీ అదృష్టం కలిసి రాక స్వల్ప స్కోర్లకే వెనుదిరుగుతున్నాడని పేర్కొన్నాడు. కోహ్లీ ఇటీవల అర్ధ శతకాలు నమోదు చేసినా.. వాటి సెంచరీలుగా మలచలేకపోతున్నాడు.

Virat Kohli
విరాట్‌ కోహ్లీ
author img

By

Published : Feb 11, 2022, 7:28 AM IST

Virat Kohli Form: విరాట్​ కోహ్లీ ఫామ్​లో లేడని అనడం సరికాదని చెప్పాడు టీమ్​ఇండియా లెజెండరీ బ్యాటర్​ సునీల్ గావస్కర్​. కానీ, అదృష్టం కోహ్లీ వైపు లేదని అన్నాడు. వెస్టిండీస్​తో రెండో వన్డేలోనూ విరాట్ విఫలమైన వేళ ఈ మేరకు వ్యాఖ్యానించాడు గావస్కర్.

Virat Kohli
విండీస్​తో మ్యాచ్​లో కోహ్లీ

"బ్యాట్ ఎడ్జ్‌ను తాకిన బంతి ఫీల్డర్‌ చేతుల్లో పడొద్దంటే.. ఏ బ్యాటర్‌కైనా కొంచెం అదృష్టం కలిసి రావాలి. కానీ, కోహ్లీకి అదృష్టం కలిసి రావడం లేదు. అందుకే, తరచూ స్వల్ప స్కోర్లకే వెనుదిరుగుతున్నాడు. అంత మాత్రాన అతడు ఫామ్‌ కోల్పోయాడని చెప్పలేం. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కీలక ఇన్నింగ్స్‌లతో ఆదుకుంటున్నాడు. జనవరిలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో రెండు అర్ధ శతకాలు నమోదు చేశాడన్న విషయాన్ని మనమంతా గుర్తుంచుకోవాలి"

-సునీల్ గావస్కర్, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో విరాట్‌ కోహ్లీ (51), మూడో వన్డేలో (65) పరుగులు చేసిన విషయం తెలిసిందే.

కోహ్లీకి పక్కా ప్రణాళికతో బౌలింగ్ చేశారు: ఇయాన్ బిషప్‌

విరాట్‌ కోహ్లీని ఔట్ చేసేందుకు వెస్టిండీస్‌ బౌలర్లు తెలివిగా బౌలింగ్‌ చేశారని మాజీ ఆటగాడు ఇయాన్ బిషప్ అన్నాడు. "విండీస్‌ బౌలర్లు కోహ్లీకి పక్కా ప్రణాళికతో బౌలింగ్ చేశారు. ఎక్కువగా షార్ట్ పిచ్‌ బంతులు వేయకుండా జాగ్రత్త పడ్డారు. రెండో వన్డేలో ఓడీన్‌ స్మిత్‌ అద్భుతమైన ఫుల్ లెంగ్త్‌ డెలివరీతో కోహ్లీని ఊరించాడు. షాట్‌కి ప్రయత్నించిన కోహ్లీ షాయ్‌ హోప్‌కి చిక్కి పెవిలియన్‌ చేరాడు. స్మిత్ చాలా తెలివిగా బౌలింగ్‌ చేశాడనుకుంటున్నాను" అని ఇయాన్ బిషప్‌ పేర్కొన్నాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో కోహ్లీ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. తొలి వన్డేలో 8, రెండో మ్యాచులో 18 పరుగులు చేసి వెనుదిరిగాడు.

ఇదీ చూడండి: విరాట్​ కోహ్లీ ఖాతాలో మరో 'సెంచరీ'.. సచిన్​, ధోనీ సరసన..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.