ETV Bharat / sports

ఆరు కాదు రెండే.. వెస్టిండీస్‌తో సిరీస్‌ వేదికల్లో మార్పు - క్రికెట్ అప్డేట్స్​

పేటీఎం సిరీస్‌లో భాగంగా ఫిబ్రవరి 6 నుంచి 20 వరకు మూడేసి వన్డేలు, టీ20 మ్యాచ్‌ల్లో భారత్‌, విండీస్‌ తలపడనున్నాయి. అయితే కరోనా కారణంగా ఈ వేదికల్లో తాజాగా మార్పులు జరిగాయి. ఈ విషయాన్ని భారత క్రికెట్‌ బోర్డు నియంత్రణ మండలి (బీసీసీఐ) శనివారం ట్విటర్‌ వేదికగా వెల్లడించింది.

cricket
క్రికెట్ వార్తలు
author img

By

Published : Jan 22, 2022, 10:33 PM IST

సొంతగడ్డపై వచ్చే నెలలో వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌ జరగనున్న విషయం తెలిసిందే. పేటీఎం సిరీస్‌లో భాగంగా ఫిబ్రవరి 6 నుంచి 20 వరకు మూడేసి వన్డేలు, టీ20 మ్యాచ్‌ల్లో భారత్‌, విండీస్‌ తలపడనున్నాయి. అయితే కరోనా కారణంగా ఈ వేదికల్లో తాజాగా మార్పులు జరిగాయి. ఈ విషయాన్ని భారత క్రికెట్‌ బోర్డు నియంత్రణ మండలి (బీసీసీఐ) శనివారం ట్విటర్‌ వేదికగా వెల్లడించింది.

ఆరు మ్యాచ్‌లను ఆరు వేదికల్లో నిర్వహించాలని తొలుత భావించిన సీబీసీఐ.. పలు కారణాలతో ఆ నిర్ణయాన్ని మార్చుకుంది. ఆరు మ్యాచ్‌లను రెండు వేదికలకే పరిమితం చేసింది. ఫిబ్రవరి 6, 9, 11వ తేదీల్లో జరిగే మూడు వన్డే మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలోనే నిర్వహించనున్నారు. ఆ తర్వాత 16, 18, 20వ తేదీల్లో జరిగే మూడు టీ20 మ్యాచ్‌లను కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో నిర్వహించనున్నట్లు బీసీసీఐ తాజాగా ప్రకటించింది.

cricket news
వెస్టిండీస్‌తో సిరీస్‌ వేదికల్లో మార్పు

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: టీమ్ఇండియా స్పిన్నర్లపై పంత్ షాకింగ్ కామెంట్స్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.