India Vs srilanka: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన శ్రీలంకతో తొలి టెస్టు మ్యాచ్.. మొహాలీ వేదికగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో తొలుత టీమ్ఇండియా టాస్ గెలిచింది. లంకను బౌలింగ్‌కు ఆహ్వానించింది.
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఇది 100వ టెస్టు కావడం విశేషం. ఈ నేపథ్యంలోనే పంజాబ్‌లోని ఐఎస్ బింద్రా స్టేడియానికి అభిమానులు ఉత్సాహంగా తరలివచ్చారు. ఈ మ్యాచ్‌కు 50శాతం ప్రేక్షకులను అనుమతించింది బీసీసీఐ. అలాగే ఇది శ్రీలంక ఆడుతున్న 300వ టెస్టు కావడం విశేషం.
పెద్ద వయస్కుడిగా..
టెస్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మకు ఇదే తొలి మ్యాచ్. గత 60ఏళ్లలో భారత్ తరపున టెస్టు కెప్టెన్సీ చేపట్టిన రెండో పెద్ద వయస్కుడిగా నిలిచాడు రోహిత్ (34ఏళ్ల 308రోజులు). అనిల్ కుంబ్లే (37ఏళ్ల 36రోజులు)అతడి కన్నా ముందున్నాడు.
పుజారా లేకుండానే..
దశాబ్ద కాలంగా టెస్టుల్లో రాణిస్తూ వచ్చిన.. అజింక్య రహానె, ఛెతేశ్వర్ పుజారాకు ఈ సిరీస్‌లో చోటు లభించలేదు. 2012 నుంచి స్వదేశంలో పుజారా లేకుండా టీమ్ఇండియా ఆడుతున్న తొలి టెస్టు ఇదే.
తుది జట్లు..
భారత్: రోహిత్ (కెప్టెన్), మయాంక్, విహారి, కోహ్లీ, శ్రేయస్, పంత్ (వికెట్ కీపర్), జడేజా, అశ్విన్, జయంత్ యాదవ్, షమీ, బుమ్రా
శ్రీలంక: దిముత్ కరుణరత్నె (కెప్టెన్), తిరిమానె, నిస్సంక, అసలంక, మాథ్యూస్, ధనంజయ డిసిల్వా, డిక్వెలా (వికెట్ కీపర్), లక్మల్, విశ్వ ఫెర్నాండో, ఎంబుల్దేనియా, లహిరు కుమార.
ఇవీ చూడండి:
Virat Kohli: 'వంద టెస్టులు ఆడతానని నిజంగా ఊహించలేదు'
టెస్టు చరిత్రలో స్వర్ణయుగం.. కోహ్లీ శకం- ఈ రికార్డులపై ఓ లుక్కేయండి