ETV Bharat / sports

SL vs IND: క్వారంటైన్​ కోసం ముంబయికి ధావన్​సేన - ముంబయిలో క్వారంటైన్ అయిన ధావన్ సేన

శ్రీలంక పర్యటన నిమిత్తం ఎంపిక చేసిన టీమ్ఇండియా ఆటగాళ్లు ముంబయిలో క్వారంటైన్ అయ్యారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది. వారికి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్​లో షేర్ చేసింది.

bhuvaneshwar kumar, shikhar dhawan
భువనేశ్వర్ కుమార్, శిఖర్ ధావన్
author img

By

Published : Jun 15, 2021, 6:28 PM IST

శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం ఎంపిక చేసిన టీమ్ఇండియా ఆటగాళ్లు.. క్వారంటైన్​ నిమిత్తం ముంబయిలో సమావేశమయ్యారు. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించింది.

శిఖర్​ ధావన్​ నేతృత్వంలోని 20 మందితో కూడిన భారత జట్టు తప్పనిసరి క్వారంటైన్ కోసం ముంబయిలో కలుసుకుంది. లంక పర్యటనకు వెళ్లే ముందు వీరంతా 14 రోజుల కఠిన నిర్బంధంలో ఉండనున్నారు. జులై 13న తొలి వన్డే ప్రారంభం కానుంది.

ఈ విషయంపై ట్విట్టర్​ వేదికగా స్పందించిన బీసీసీఐ.. కెప్టెన్ ధావన్​, వైస్​ కెప్టెన్ భువనేశ్వర్​ కుమార్​తో పాటు ఆటగాళ్లకు సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది. ఈ లంక పర్యటనకు భారత జట్టు కోచ్​గా రాహుల్ ద్రవిడ్ వ్యవహరిస్తాడని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ అధికారికంగా వెల్లడించాడు.

భారత జట్టు..

ధావన్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), పృథ్వీ షా, పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, మనీష్ పాండే, హార్దిక్ పాండ్యా, నితీష్ రానా, ఇషాన్ కిషన్, శాంసన్, చాహల్, రాహుల్ చాహర్, కృష్ణప్ప గౌతమ్, కుల్దీప్, కృనాల్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, దీపక్ చాహర్, నవదీప్ సైనీ, చేతన్ సకారియా.

నెట్ బౌలర్లు: ఇషాన్ పోరెల్, సందీప్ వారియర్, అర్షదీప్ సింగ్, సాయి కిషోర్, సిమర్​జీత్ సింగ్.

ఇదీ చదవండి: శునకంతో రవిశాస్త్రి క్యాచ్​ల ప్రాక్టీస్.. వీడియో వైరల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.