ETV Bharat / sports

డే అండ్ నైట్ టెస్టుల్లో భార‌త్ సత్తా ఎంత‌? - భారత్​ డై అండ్​ నైట్​ టెస్టుల రికార్డులు

India pink ball tests records: ఫ్లడ్‌లైట్ల వెలుతురు.. మెరిసే గులాబి బంతితో పోరు.. వికెట్లను కూల్చే పేసర్ల జోరు.. సవాలును ఎదుర్కొనే బ్యాటర్ల పట్టుదల..మధ్యలో తిప్పేసే స్పిన్నర్లు.. ఇదీ డేనైట్‌ టెస్టులు అందించే క్రికెట్‌ మజా. శ్రీలంక జట్టుతో టీమ్​ఇండియా.. శనివారం నుంచి గులాబి బంతితో తలపడనుంది. ఈ నేపథ్యంలో గత డై అండ్​ నైట్​ మ్యాచ్​ల ప్రదర్శనలను ఓ సారి పరిశీలిద్దాం..

day and night test
pink ball test
author img

By

Published : Mar 11, 2022, 7:08 AM IST

India pink ball tests records: డే అండ్ నైట్​ టెస్టుల మజాయే వేరు. ఫ్లడ్​లైట్ల వెలుతురులో..గులాబి బంతితో జరిగే పోరులో బ్యాటర్లు, బౌలర్లు విజృంభిస్తుంటారు. బంగ్లాదేశ్​పై ఘన విజయంతో గులాబి బంతుల ఫార్మాట్లో అదిరే ఆరంభం చేసిన టీమ్‌ఇండియా.. చివరగా ఇంగ్లాండ్‌ను ఆ బంతితో మట్టి కరిపించింది. కానీ మధ్యలో ఆస్ట్రేలియాతో ఓ పీడకల లాంటి ప్రదర్శనతో ఓటమిని మూటగట్టుకుంది. ఇప్పటివరకూ మూడు డే అండ్​ నైట్‌ టెస్టులాడిన భారత్‌.. రెండు మ్యాచ్‌ల్లో గెలిచి, ఒక దాంట్లో ఓడింది. శ్రీలంకతో తొలిసారి గులాబి బంతి పోరుకు జట్టు సిద్ధమైన నేపథ్యంలో గత ప్రదర్శనలను ఓ సారి గుర్తు చేసుకుందాం!

భారీ విజయంతో ఆరంభం..

భారత్‌ తన తొలి డేనైట్‌ టెస్టులో భారీ విజయంతో గులాబి బంతితో ప్రయాణాన్ని ఘనంగా మొదలెట్టింది. 2019లో సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా చివరి మ్యాచ్‌ గులాబి బంతితో జరిగింది. అప్పటికే తొలి టెస్టులో ప్రత్యర్థిని చిత్తుచేసిన టీమ్‌ఇండియా.. తమ తొలి డేనైట్‌ టెస్టు కోసం మెరుగ్గా సన్నద్ధమైంది. ఈడెన్‌ గార్డెన్స్‌లో ఫ్లడ్‌లైట్ల వెలుతురులో గులాబి బంతి మాయను ఆస్వాదించింది. ఆ మ్యాచ్‌లో భారత పేసర్లు వికెట్ల పండగ చేసుకున్నారు. అన్ని వికెట్లను వాళ్లే ఖాతాలో వేసుకున్నారు. మొదట బ్యాటింగ్‌ చేసిన బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో 106 పరుగులకే కుప్పకూలింది. అప్పటి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (136) అద్భుత శతకంతో భారత్‌ 347/9 వద్ద తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. కోహ్లి చివరగా చేసిన అంతర్జాతీయ సెంచరీ ఇదే. అప్పటి నుంచి అతని శతక నిరీక్షణ కొనసాగుతోంది. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాను 195కే ఆలౌట్‌ చేసిన భారత్‌ ఇన్నింగ్స్‌, 46 పరుగుల తేడాతో గెలిచింది. మూడు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో ఇషాంత్‌ తొమ్మిది వికెట్లు పడగొట్టాడు.

indian team
భారత క్రికెట్​ జట్టు

ఊహించని పరాభవం..

Ind vs Ban pink ball test: తన తొలి డేనైట్‌ టెస్టులో ఘన విజయం సాధించిన భారత్‌కు రెండో మ్యాచ్‌లో ఊహించని పరాభవం ఎదురైంది. మర్చిపోవాల్సిన చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది. బోర్డర్‌- గావస్కర్‌ (2020-21) ట్రోఫీలో భాగంగా అడిలైడ్‌లో తొలి టెస్టులోనే గులాబి బంతి సవాలు ఎదురైంది. కోహ్లి (74) పోరాటంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 244 పరుగులు చేయగలిగింది. అనంతరం ఆస్ట్రేలియాను 191 పరుగులకే కుప్పకూల్చింది. గులాబి బంతితో పేసర్లు వికెట్ల వేటలో దూసుకెళ్తారు. కానీ ఆ ఇన్నింగ్స్‌లో అదీ ఆసీస్‌ గడ్డపై స్పిన్నర్‌ అశ్విన్‌ (4/55) మాయ చేయడం విశేషం. ఇక రెండో ఇన్నింగ్స్‌లో వీలైనన్ని ఎక్కువ పరుగులు చేసి ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని నిలపాలని జట్టు భావించింది. కానీ పరిస్థితి తలకిందులైంది. కేవలం 36 పరుగులకే ఆలౌటై.. భారత టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఓ ఇన్నింగ్స్‌లో అతి స్వల్ప స్కోరు రికార్డును నమోదు చేసింది. ప్రతి భారత క్రికెట్‌ అభిమానికి తీవ్ర ఆవేదన కలిగించింది. ఛేదనలో ఆసీస్‌ అలవోకగా విజయాన్ని అందుకుంది. కానీ ఆ తర్వాత మిగిలిన టెస్టుల్లో భారత్‌ అసమాన పోరాటంతో సిరీస్‌ను 2-1తో దక్కించుకుని చరిత్ర సృష్టించింది.

రెండు రోజుల్లోనే..

Ind vs Eng pink ball test: స్వదేశంలో ఇంగ్లాండ్‌తో తొలిసారి ఆడిన డేనైట్‌ టెస్టులో భారత్‌ రెచ్చిపోయింది. టీమ్‌ఇండియా తొలి రెండు గులాబి బంతి మ్యాచ్‌లు మూడు రోజుల్లో ముగిస్తే.. ఈ పోరులో మాత్రం జట్టు రెండు రోజుల్లోనే ప్రత్యర్థి భరతం పట్టింది. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్‌ గులాబి బంతితో అహ్మదాబాద్‌లో జరిగింది. ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియంగా పునఃనిర్మించిన తర్వాత నరేంద్ర మోదీ మైదానంలో జరిగిన తొలి మ్యాచ్‌ ఇదే కావడం విశేషం. మొదట బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ 112 పరుగులకే కుప్పకూలింది. అక్షర్‌ (6/38) ఆ జట్టును తిప్పేశాడు. బదులుగా తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌.. రోహిత్‌ (66) ఆదుకోవడంతో 145 పరుగులు చేసింది. అక్షర్‌ (5/32) మరోసారి మాయ చేయడంతో రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లిష్‌ జట్టు 81 పరుగులకే ఆలౌటైంది. అనంతరం స్వల్ప ఛేదనలో ఒక్క వికెట్‌ కూడా కోల్పోకుండా టీమ్‌ఇండియా లక్ష్యాన్ని చేరుకుంది.

ఇదీ చదవండి: IND Vs SL: ఫ్యాన్స్​కు గుడ్​ న్యూస్​.. 100శాతం ప్రేక్షకులకు అనుమతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.