India vs Pakistan World Cup Rivalry : భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పటికీ స్పెషలే. క్రికెట్ ప్రేమికులు ఈ దాయాదుల సమరాన్ని.. ఓ యుద్ధంలా చూస్తారు. క్రికెట్లో మరే ఇతర జట్ల మ్యాచ్‌లకు ఇంతటి క్రేజ్ ఉందదు. యావత్ క్రికెట్ ప్రపంచంలోనే భారత్-పాక్ మ్యాచ్ అంటే ఫ్యాన్స్.. ఈ లోకాన్ని మరచి టీవీలకు అతుక్కుపోతుంటారు. ఇక ఇరు దేశాల అభిమానులైతే ఎంతో ఉద్వేగానికి లోనవుతారు కూడా.
కొన్ని కారణాల వల్ల.. గత కొన్నేళ్లుగా భారత్-పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ల్లేవ్. ఈ రెండు జట్లు పోటీపడేది కేవలం ఐసీసీ ఈవెంట్లలోనే. అందుకే ఇరుజట్ల మధ్య పోరుకు మరింత హైప్ పెరిగింది. సుమారు నాలుగేళ్ల తర్వాత.. 2023 ఆసియా కప్‌లో తలపడ్డ ఈ చిరకాల ప్రత్యర్థుల పోరుకు ఏ రేంజ్లో వ్యూస్ వచ్చాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇప్పుడు మరోసారి 2023 వరల్డ్‌కప్‌లో భాగంగా మరోసారి.. హై వోల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియం వేదికగా.. అక్టోబర్ 14న మహా సమరం జరగనుంది. ఈ నేపథ్యంలో వన్డే వరల్డ్‌కప్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లపై ఓలుక్కేద్దాం.
వరల్డ్‌కప్‌లో మనదే డామినేషన్.. వన్డే ప్రపంచకప్‌లో పాక్‌పై.. భారత్ పూర్తి ఆధిపత్యం చలాయిస్తూ వస్తోంది.1975-2019 దాకా జరిగిన వన్డే ప్రపంచకప్ టోర్నీల్లో భారత్-పాక్ ఏడుసార్లు తలపడ్డాయి. ఈ ఏడుసార్లు భారత్.. జయకేతనం ఎగురవేసింది. ఇందులో ముఖ్యంగా 2011 ఎడిషన్ సెమీఫైనల్ మ్యాచ్ హైలైట్. ఈ మ్యాచ్‌లో భారత్ 29 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఇంకా భారత్ ఎప్పుడుడెప్పడు, ఎక్కడ పాక్‌తో తలపడిందంటే..
ఎప్పుడు? | ఎంత మార్జిన్? | ఎక్కడ? |
1992 మార్చి 4 | 43 పరుగులు | సిడ్ని |
1996 మార్చి 9 | 43 పరుగులు | బెంగళూర్ |
1999 జూన్ 8 | 47 పరుగులు | మాంచెస్టర్ |
2003 మార్చి 1 | 6 వికెట్లు | సెంచూరియన్ |
2011 మార్చి 30 | 29 పరుగులు | మొహాలీ |
2015 ఫిబ్రవరి 15 | 76 పరుగులు | అడిలైడ్ |
2019 జూన్ 16 | 89 పరుగులు డక్‌వర్త్ లూయిస్ | మాంచెస్టర్ |
ఓవరాల్‌గా ఎవరిది పైచేయి?
క్రికెట్లో భారత్-పాకిస్థాన్ హెడ్ టు హెడ్ పోరులో పాక్‌దే పైచేయిగా ఉంది. ఇరుజట్లు ఇప్పటివరకూ 134 వన్డే మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో భారత్ 56 సార్లు విజయం సాధించగా.. పాక్ 73 మ్యాచ్‌ల్లో నెగ్గింది. ఐదింట్లో ఫలితం తేలలేదు. ఇందులో పాక్ తమ సొంత గడ్డపై 17సార్లు విజయం సాధించగా.. భారత్ స్వదేశంలో 11 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ఇక భారత్‌లోనూ.. టీమ్ఇండియాపై దాయాదికి మంచి రికార్డే ఉంది. భారత్‌లో, పాక్ 19సార్లు గెలిచింది. ఇక చివరిసారిగా రెండు జట్లు 2023 ఆసియా కప్‌లో తలపడ్డాయి. సూపర్ 4లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను, భారత్ 228 పరుగుల భారీ ఆధిక్యంతో చిత్తుగా ఓడించింది.
-
We are here in Ahmedabad! 👋#CWC23 | #TeamIndia | #INDvPAK | #MeninBlue pic.twitter.com/dVuOaynYRN
— BCCI (@BCCI) October 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">We are here in Ahmedabad! 👋#CWC23 | #TeamIndia | #INDvPAK | #MeninBlue pic.twitter.com/dVuOaynYRN
— BCCI (@BCCI) October 12, 2023We are here in Ahmedabad! 👋#CWC23 | #TeamIndia | #INDvPAK | #MeninBlue pic.twitter.com/dVuOaynYRN
— BCCI (@BCCI) October 12, 2023