ఓవల్‌లో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ బౌలర్లపై టీమ్ఇండియా ఆధిపత్యం చెలాయిస్తోంది. టీ సమయానికి 8 వికెట్లు కోల్పోయి 445 పరుగులు చేసింది. దీంతో ఆధిక్యం 346కు చేరింది.
పంత్- శార్దుల్ ధనాధన్...
లంచ్‌కి ముందు విరాట్, రహానే ఔట్ అవ్వడం వల్ల పంత్ మీదే భారం పడింది. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్న పంత్(50) మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఇక శార్దుల్ ఠాకుర్(60) మరోసారి రెచ్చిపోయాడు. ఫోర్లు, సిక్సర్లతో ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇద్దరు విలువైన భాగస్వామ్యాన్ని జట్టుకు అందించారు. ఈ క్రమంలో శార్దుల్‌ను రూట్ ఔట్ చేయగా.. భారీ షార్ట్‌కు ప్రయత్నించి మోయిన్ అలీకి చిక్కాడు పంత్.
ఇక చేతిలో మిగిలింది రెండు వికెట్లే. టీమ్ఇండియాను తొందరగా ఆలౌట్ చేద్దామని ఇంగ్లాండ్ భావించినా.. అది జరగలేదు. క్రీజులోకి వచ్చిన ఉమేశ్(13*), బుమ్రా(19*) కూడా ఇంగ్లాండ్ బౌలర్లపై ఆధిపత్యాన్ని చెలాయించారు. ఫోర్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు.
అటు ఇంగ్లాండ్ బౌలర్లలో రాబిన్సన్, క్రిస్ ఓక్స్, మోయిన్ అలీ తలో రెండు వికెట్లు పడగొట్టారు. 33 ఓవర్లు వేసిన ఆండర్సన్ 79 పరుగులు సమర్పించుకుని కేవలం 1 వికెట్ తీశాడు.
టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్: 191/10
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 290/10
ఇదీ చూడండి: ధోనీ రికార్డు బ్రేక్ చేసిన పంత్- కోహ్లీ మళ్లీ..