India Vs Australia World Cup 2023 Final : భారత్ - ఆస్ట్రేలియా మధ్య తుది పోరు కోసం రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ కోసం అటు క్రికెట్ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు వరుస విజయాలతో అజేయంగా నిలిచిన రోహిత్ సేన.. ఈసారి ఎలాగైన వరల్డ్ కప్‌ను అందుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు ఆసిస్ కూడా తగ్గేదేలే అంటూ కసరత్తులు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సమస్యలు టీమ్ఇండియాను కలవరపెడుతున్నాయి.
మిస్సైన సిరాజ్ మెరుపులు..!
బౌలింగ్‌లో ఇంతకుముందు మెరిసిన మహ్మద్ సిరాజ్.. ఈ టోర్నీలో అంతంతమాత్రంగానే ఆడుతున్నాడు. ఈ వరల్డ్ కప్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఏడు ఓవర్లలో 16 రన్స్ మాత్రమే సమర్పించుకుని మూడు వికెట్లను పడగొట్టిన ఈ స్టార్ ప్లేయర్.. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం 9 ఓవర్లలో 78 పరుగులు ఇచ్చాడు. దీంతో రానున్న మ్యాచ్‌లోనైనా ఈ స్టార్ ప్లేయర్ తిరిగి ఫామ్‌లోకి రావాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
-
Pumped 🆙 for the #CWC23 Final 🏟️👌#TeamIndia | #MenInBlue | #Final | #INDvAUS pic.twitter.com/9YtJiO2anE
— BCCI (@BCCI) November 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Pumped 🆙 for the #CWC23 Final 🏟️👌#TeamIndia | #MenInBlue | #Final | #INDvAUS pic.twitter.com/9YtJiO2anE
— BCCI (@BCCI) November 17, 2023Pumped 🆙 for the #CWC23 Final 🏟️👌#TeamIndia | #MenInBlue | #Final | #INDvAUS pic.twitter.com/9YtJiO2anE
— BCCI (@BCCI) November 17, 2023
కఠిన పరిస్థితి ఎదుర్కోని లోయర్ ఆర్డర్!
టాప్ ఆర్డర్ ప్లేయర్లు పటిష్టంగా ఉండటం వల్ల లోయర్ ఆర్డర్లో ఉన్నవారెవరూ ఇప్పటివరకు ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కోలేదు. అయితే వరల్డ్‌కప్‌లో ఏదైనా జరగచ్చు. అటువంటప్పుడు జట్టులోని అందరూ కూడా మంచి ఫామ్‌లో ఉండాల్సిందే. లేకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా వంటి ఆటగాళ్లకు మ్యాచ్‌లో ఆడేందుకు అంతగా అవకాశాలు దక్కక పోవడం వల్ల వారు కీలక ఇన్నింగ్స్‌లో ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుందని మాజీలు అంటున్నారు.
బౌలర్లు బ్యాట్ ఝుళిపించాలి!
హార్దిక్ జట్టులోకి లేకపోవడం కూడా టీమ్ఇండియాకు పెద్ద లోటు. గత ఆరు మ్యాచ్‌ల్లో ఆరుగురు బ్యాటర్లతో రంగంలోకి దిగిన రోహిత్ సేన.. ఆడిన మ్యాచుల్లో మంచి ఫామ్‌లోనే ఉంది. అయితే బుమ్రా, షమీ వంటి బౌలర్లు కొంత మేర బ్యాటింగ్ ప్రతిభను కలిగి ఉన్నప్పటికీ.. క్రీజులో వారు సహాయక పాత్ర పోషించడమే తప్ప బ్యాటు ఝుళిపించలేదు. అయితే ఆసిస్ జట్టు మాత్రం టీమ్ఇండియాకు భిన్నంగా రాణిస్తోంది.
వరల్డ్ కప్ మహాసంగ్రామం- వ్యూహాలకు టీమ్ఇండియా పదును- 'బిలియన్ డ్రీమ్స్' సాకారమయ్యేనా?
'టీమ్ఇండియా అన్ని విభాగాల్లో బాగుంది- షమీ మాకు పెద్ద సవాల్!' : ప్యాట్ కమిన్స్