India Vs Australia World Cup 2023 Final : ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమ్ఇండియా ఇన్నింగ్స్ ముగిసింది. మొదటి నుంచి తడబడతూ వచ్చిన టీమ్ఇండియా 9 వికెట్లు నష్టానికి 240 పరుగులు చేసింది. ఆసీస్‌కు 241 పరుగులు టార్గెట్ ఇచ్చింది. టీమ్ఇండియా ఆచి తూచి ఆడినప్పటికీ.. ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి విలవిల్లాడిపోయింది. దీంతో భారీ లక్ష్యాన్ని సాధిస్తుందనుకున్న రోహిత్ సేన 240 పరుగులకే పరిమితమైంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లుగా దిగిన రోహిత్(47), శుభమన్(4) పరిమిత పరుగులకే పెవిలియన్ బాట పట్టారు. గిల్ ఔటయ్యాక.. జాగ్రత్తగా ఆడిన రోహిత్.. అర్థశతకానికి చేరువలో ఉన్నసమయంలో ఔటయ్యాడు. ఇక ఆ తర్వాత క్రీజులోకి దిగిన విరాట్ కోహ్లి దూకుడుగా ఆడాడు. ఓ అర్థశతకాని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే 54 పరుగుల వద్ద కమిన్స్ చేతికి చిక్కాడు.
ఇక తన ఆటతీరుతో పరుగులను అందిస్తాడనుకున్న శ్రేయస్ అయ్యర్ కూడా 4 పరుగులకే వెనుతిరిగాడు. అయితే జట్టుకు కేఎల్ రాహుల్ మంచి స్కోర్‌ను అందించాడు.107 బంతుల్లో 66 పరుగులు సాధించిన రాహుల్.. సెంచరీ దిశగా జోరుగా దూసుకెళ్లాడు. అయితే 41వ ఓవర్ వద్ద మిచెల్ స్టార్క్ చేతిలో ఔటయ్యాడు. ఆ తర్వాత రంగంలోకి దిగిన సూర్యకుమార్ యాదవ్ (18) పరుగులు చేయగా.. శుభ్‌మన్ గిల్ (4), శ్రేయస్ అయ్యర్ (4), జడేజా (9) విఫలమయ్యారు. ఇక ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3, హేజిల్ వుడ్ 2, కమిన్స్ 2, మ్యాక్స్‌వెల్, ఆడమ్ జంపా తలో వికెట్ పడగొట్టారు.
రోహిత్ అరుదైన రికార్డులు..
ఈ సీజన్‌లో రోహిత్ కొన్ని అరుదైన రికార్డులు బద్దలు కొట్టాడు. ఒక ప్రపంచకప్ టోర్నీలో తొలి 10 ఓవర్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. ఈ టోర్నీలో రోహిత్ మొత్తం 354 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో చేసిన 47 పరుగులతో కలిపి ఈ రికార్డు 401గా మెరుగుపడింది. గతంలో ఈ రికార్డు 2015లో న్యూజిలాండ్ ఆటగాడు మెక్‌కల్లం చేసిన 308 పరుగులుగా ఉంది. 2003 ప్రపంచకప్ టోర్నీలో గిల్ క్రిస్ట్ కేవలం తొలి పది ఓవర్లలోనే 276 పరుగులు చేశాడు. అంతే కాకుండా ప్రపంచకప్ టోర్నీల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రోహిత్ నాలుగో స్థానానికి ఎగబాకాడు. డు.