12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత టెస్ట్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన వెటరన్ పేసర్, రంజీ ఛాంపియన్ జయదేవ్ ఉనాద్కత్.. వన్డే జట్టులో కూడా చోటు దక్కించుకున్నాడు. ఆదివారమే ముగిసిన దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీరంజీ ట్రోఫీ 2022-23లో సౌరాష్ట్రను విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ జయదేేవ్కు బీసీసీఐ ప్రమోషన్ ఇచ్చింది. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో చోటు కల్పించింది. దీంతో అతడు 10 ఏళ్ల తర్వాత వన్డే జట్టులో చోటు సంపాదించాడు. చివరగా 2013లో అతడు వన్డే మ్యాచ్ ఆడాడు.
బంగాల్‌తో జరిగిన రంజీ ఫైనల్ మ్యాచ్‌లో సౌరాష్ట్ర తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొంది వరుసగా రెండో సారి టైటిల్‌ను అందుకుంది. గత సీజన్ రంజీ ట్రోఫీ 2021-22ని కూడా సౌరాష్ట్రనే గెలచింది. ఫైనల్లో సత్తా చాటిన కెప్టెన్ జయదేవ్ ఉనాద్కత్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
మరోవైపు, గాయంతో కొన్ని నెలలుగా దూరంగా ఉన్న జస్ప్రీత్ బుమ్రా.. ఈ సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. వరుస మ్యాచుల్లో విఫలమవుతున్న కేఎల్ రాహుల్‌కు సెలెక్టర్లు మరో అవకాశం ఇచ్చారు. వ్యక్తిగత పనులతో తొలి వన్డేకు కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కానుండగా.. వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్య ఆ మ్యాచ్‌లో జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. మార్చి 17, 19, 22 తేదీల్లో ఈ సిరీస్ జరగనుంది.
భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, జయదేవ్ ఉనద్కత్.