India Vs Australia 3rd T20 2023 : ఐదు మ్యాచ్‌ల టీ20 సరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన మూడో టీ20లో టీమ్ఇండియాపై ఆస్ట్రేలియాపై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. ఆసీస్‌కు 223 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మొదట తడబడింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (35) ఫర్వాలేదనిపించినా.. అరోన్ హార్డీ (16) నిరాశ పరిచాడు. వన్‌డౌన్ దిగిన జోష్ ఇంగ్లిస్ (10) కూడా పేలవ ప్రదర్శన చేశాడు. ఈ క్రమంలో వచ్చిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ (104*) విశ్వరూపం చూపించాడు. ఫోర్లు, సిక్సర్లు కొడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అయిదే అతడికి మార్కస్ స్టాయినిస్ (17) మద్దతుగా నిలిచేందుకు ప్రయత్నించాడు. కానీ అక్షర్ పటేల్ వేసిన 13వ ఓవర్ చివరి బంతికి సూర్యకుమార్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన టిమ్ డేవిడ్ (0) డకౌట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి దిగిన కెప్టెన్ మాథ్యూ వేడ్ (28*) మ్యాక్స్‌వెల్‌తో కలిసి చివరి వరకు పోరాడి జట్టును విజయ తీరాలకు చేర్చారు. ఇక భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ రెండు వికెట్లు పడగొట్టాడు. అర్ష్‌దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీశారు.
కొంపముంచిన చివరి ఓవర్..
ప్రసిద్ధ్ కృష్ణ వేసిన 20వ ఓవర్ టీమ్ఇండియా కొంపముంచింది. ఓవర్లో రెండో బంతి సింగిల్ మినహా.. వరుసగా ఫోర్లు, సిక్సర్లు బాదారు ఆస్ట్రేలియా బ్యాటర్లు. (4, 1, 6, 4, 4, 4 )
రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ వృథా..
అంతకుముందు టాస్ బౌలింగ్‌కు దిగిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోరు సాధించింది. స్టార్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ (123*; 57 బంతుల్లో 13x4, 7x6) సెంచరీతో కదంతొక్కాడు. యశస్వి జైస్వాల్ (6), ఇషాన్ కిషన్ (0) నిరాశపర్చారు. సూర్యకుమార్ యాదవ్ (39; 29 బంతుల్లో 5x4, 2x6), తిలక్ వర్మ (31*; 24 బంతుల్లో 4x4) దూకుడుగా ఆడారు. ఇక ఆసీస్ బౌలర్లలో కేన్ రిచర్డ్ సన్, బెరెన్‌డార్ఫ్, ఆరోన్ హార్డీ తలో వికెట్ పడగొట్టారు. కాగా ఈ టీ20 సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్‌లో రెండింట్లో విజయం సాధించింది 2-1 తేడాదో టీమ్ఇండియా అధిక్యంలో నిలిచింది.
-
That's that from the third T20I, Australia win by 5 wickets.
— BCCI (@BCCI) November 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
The five match series now stands at 2-1.#INDvAUS @IDFCFIRSTBank pic.twitter.com/3a2wbpIHPV
">That's that from the third T20I, Australia win by 5 wickets.
— BCCI (@BCCI) November 28, 2023
The five match series now stands at 2-1.#INDvAUS @IDFCFIRSTBank pic.twitter.com/3a2wbpIHPVThat's that from the third T20I, Australia win by 5 wickets.
— BCCI (@BCCI) November 28, 2023
The five match series now stands at 2-1.#INDvAUS @IDFCFIRSTBank pic.twitter.com/3a2wbpIHPV
'కొన్నిసార్లు నిశ్శబ్దమే ఉత్తమ సమాధానం'- బుమ్రా ఇన్‌స్టా స్టోరీకి అర్థం అదేనా!
రిచెస్ట్ క్రికెటర్‌గా యువరాణి- 225 ఎకరాల ఎస్టేట్, 150కి పైగా గదుల ప్యాలెస్, ఆమె ఎవరో తెలుసా!