India vs Afghanistan Second T20 : ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌నకు ముందు టీమ్‌ఇండియా చివరిగా ఆడుతున్న పొట్టి సిరీస్ అఫ్గానిస్థాన్‌తో. ఇందులో భాగంగా తొలి టీ20లో గెలిచిన భారత జట్టు ఇప్పుడు రెండో మ్యాచ్‌లోనూ గెలిచి మరో పోరు మిగిలి ఉండగానే సిరీస్ పట్టేయాలని చూస్తోంది. 14 నెలల తర్వాత తిరిగి టీ20 జట్టులోకి వచ్చిన కెప్టెన్ రోహిత్, స్టార్ బ్యాటర్ కోహ్లీ ఈ సిరీస్‌కు ప్రత్యేక ఆకర్షణ. అయితే మొదటి టీ20 మ్యాచ్‌లో రోహిత్ నాయకత్వ ప్రతిభతో ఆకట్టుకున్నప్పటికీ బ్యాటింగ్‌లో మాత్రం పరుగులు చేయలేకపోయాడు. ఇక మొదటి మ్యాచ్‌కు దూరంగా ఉన్న విరాట్ ఇప్పుడు రెండో మ్యాచ్‌తో అందుబాటులోకి వచ్చాడు.
కలిసొచ్చిన జట్టుపైనే పునరాగమనం చేయాలని : 2022 టీ20 వరల్డ్ కప్ తర్వాత ఈ ఫార్మాట్లో మొదటి టీ20 ఆడేందుకు సిద్ధమైన విరాట్ తనకు కలిసొచ్చిన అఫ్గానిస్థాన్‌పై చెలరేగి ఘనంగా పునరాగమనం చేయాలని ఆశిస్తున్నాడు. 2022లో టీ20 ఫార్మాట్లో జరిగిన ఆసియా కప్‌లో అఫ్గానిస్థాన్‌పైనే సెంచరీ బాది - తన సుదీర్ఘ సెంచరీ నిరీక్షణకు ముగింపు పలికాడు.ఇప్పుడు మరోసారి అదే జట్టుపై రాణించి జట్టులో తన ఎంపిక సరైందేనని చాటాలనుకుంటున్నాడు. అయితే విరాట్ రాకతో హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ బెంచ్‌కే పరిమితమయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే కెరీర్‌ను గొప్పగా ప్రారంభించిన తిలక్ ఆ తర్వాత తడబడుతు ఆడుతున్న సంగతి తెలిసిందే. గత 13 ఇన్నింగ్స్‌లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా బాదలేదు. ఇక యశస్వి జైస్వాల్ కూడా ఫిట్‌నెస్ సాధిస్తే శుభ్‌మన్ కూడా జట్టు బయటే ఉండాల్సి వస్తుంది.
- — BCCI (@BCCI) January 13, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
— BCCI (@BCCI) January 13, 2024
">— BCCI (@BCCI) January 13, 2024
అతడిపైనే దృష్టి : మొదటి టీ20లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు శివమ్ దూబె. ఇప్పుడు మరోసారి అందరి దృష్టి అతడిపైనే ఉంది. హార్దిక్ గైర్హాజరీలో పేస్ ఆల్‌రౌండర్ స్థానాన్ని భర్తీ చేసేలా కనిపిస్తున్నాడు. కాబట్టి అతడు నిలకడ కొనసాగించాల్సి ఉంది. గాయంతో వన్డే ప్రపంచకప్‌కు దూరమైన అక్షర్ పటేల్ ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో ఆడాలనే పట్టుదలను ప్రదర్శిస్తున్నాడు. కాబట్టి అతడికి ప్రతి మ్యాచ్ కీలకమే. మొదటి టీ20లో పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా రెండు వికెట్లతో రాణించిన అతడు ఈ మ్యాచ్‌లోనూ ఫామ్ కొనసాగించాలి. గత మ్యాచ్‌లో వికెట్ల వేటలో సుందర్ ఫెయిల్ అయ్యాడు. 3 ఓవర్లలో 27 పరుగులిచ్చి ఒక్క వికెట్టూ తీయలేకపోయాడు. కాబట్టి అతడికి మరో అవకాశం వస్తుందని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అతని స్థానంలో కుల్‌దీప్‌ను ఆడించే ఛాన్స్ ఉంది. మరోవైపు యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్ కూడా 11కు పైగా ఎకానమీ రేటుతో పరుగులు సమర్పించుకున్నాడు. తన సొంత మైదానంలో అవేశ్‌ను ఆడించాలని అనుకుంటే బిష్ణోయ్ బయటే ఉంటాడు. భారత ఫీల్డింగ్ మాత్రం మరింత మెరుగుపడాలి.
ఇక మొదటి టీ20లో చెప్పుకోదగ్గ ప్రదర్శనే చేసిన అఫ్గానిస్థాన్ ఆ మ్యాచ్ సాంతం తీవ్రత కొనసాగించలేకపోయింది. మంచి ఆరంభం దక్కినా భారీ స్కోరు సాధించలేకపోయింది. దీంతో రెండో మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో మరింత మెరుగ్గా రాణించి పుంజుకోవాలని చూస్తోంది.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్, శుభ్‌మన్/యశస్వి, కోహ్లి, శివమ్ దూబె, జితేశ్, రింకు సింగ్, అక్షర్, సుందర్/కుల్‌దీప్, రవి బిష్ణోయ్/అవేశ్, అర్ష్‌దీప్, ముకేశ్.
అఫ్గానిస్థాన్: గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, అజ్మతుల్లా ఒమర్‌జాయ్, నజీబుల్లా జద్రాన్, మహమ్మద్ నబి, గుల్బాదిన్ నయీబ్, కరీం జనాత్, ఫజల్ ఫరూఖీ, నవీనుల్ హక్, ముజీబ్ ఉర్ రెహ్మాన్.