ETV Bharat / sports

'భారత ఆటగాళ్లు క్రిస్మస్ మూడ్​లో ఉన్నారు' - ఆస్ట్రేలియా పర్యటన

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న పింక్ బాల్ టెస్టు రెండోరోజు ఆటలో ఫీల్డింగ్​లో టీమ్​ఇండియా తడబాటుపై.. భారత మాజీ క్రికెటర్​ సునీల్​ గావస్కర్​ స్పందించాడు. క్రిస్మస్​ మూడ్​లో ఉన్న ఆటగాళ్లు.. పండుగకు వారం ముందే ప్రత్యర్థులకు కానుకలు పంచుతున్నారని విమర్శించాడు.

Sunil gavaskar mocks india poor fielding in first test match
'క్రిస్మస్​కు వారం ముందే కానుకలు పంచుతున్నారు'
author img

By

Published : Dec 18, 2020, 5:08 PM IST

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలిటెస్టు రెండోరోజు ఆటలో టీమ్​ఇండియా ఫీల్డింగ్​ బలహీనంగా సాగింది. ఈ నేపథ్యంలో.. ఆటగాళ్లపై భారత మాజీ క్రికెటర్​ సునీల్​ గావాస్కర్​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం భారత ఆటగాళ్లు క్రిస్మస్​ మూడ్​లో ఉన్నారని.. అందుకే.. పండుగకు వారం ముందే ప్రత్యర్థులకు తమ కానుకలను పంచుతున్నారని వ్యాఖ్యానించాడు.

గులాబి టెస్టు రెండోరోజు ఆటలో ఆతిథ్య జట్టు ఆచితూచి ఆడింది. లబుషేన్​ను పెవిలియన్​ చేర్చడానికి దొరికిన రెండు అవకాశాలను టీమ్​ఇండియా చేజార్చుకుంది. డిన్నర్​ బ్రేక్​ కంటే ముందు షమీ బౌలింగ్​లో లబుషేన్​ బాదిన బంతిని బుమ్రా చేజార్చాడు. ఆ తర్వాత పృథ్వీ షా మరోసారి క్యాచ్​ వదిలేశాడు. ఈ నేపథ్యంలో జట్టు ఆటగాళ్లను ఉద్దేశించి గావస్కర్​ పై వ్యాఖ్యలు చేశాడు.

అయితే.. ఆ తర్వాత టీమ్ఇండియా సత్తా చాటింది. స్మిత్​(1),‌ హెడ్‌ (7), కామెరూన్‌ గ్రీన్‌ (11)ను పెవిలియన్‌కు చేర్చి ఆసీస్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు రవిచంద్రన్ అశ్విన్​. దీంతో 79 పరుగులకు సగం వికెట్లు కోల్పోయింది కంగారూ జట్టు. అనంతరం కెప్టెన్ పైన్ (73*) తప్ప ఎవ్వరూ రాణించకపోవడం వల్ల 191 పరుగులకే ఆలౌటై భారత్​కు 53 పరుగుల ఆధిక్యాన్ని ఇచ్చింది.

ఇదీ చూడండి:కోహ్లీ స్టన్నింగ్ క్యాచ్ .. అభిమానులు ఫుల్​ ఖుష్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.