టీమ్ఇండియా వికెట్‌కీపర్ రిషభ్ పంత్ పాట పాడుతున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. "స్పైడర్‌మ్యాన్, స్పైడర్‌మ్యాన్" అంటూ సరదాగా పాడిన పాట స్టంప్ మైక్‌లో రికార్డయ్యింది. ఆ వీడియోకు ట్విట్టర్లో 75వేల వ్యూస్‌తో పాటు 5వేల లైక్‌లు వచ్చాయి. చాలా మంది యూజర్లు 'ఇది నెక్స్ట్ లెవల్ స్టఫ్' అంటూ సరదా కామెంట్లు చేశారు.
ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 56వ ఓవర్ వద్ద ఈ సరదా ఘటన జరిగింది. అప్పుడే స్మిత్ వికెట్ కోల్పోయిన జట్టును, కామెరూన్ గ్రీన్, టిమ్ పైన్ చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు రిషభ్ చాలా సరదాగా పాట పాడటం మైక్‌లో రికార్డయ్యింది.
వికెట్ల వెనుక పంత్ చాలా చిలిపిగా ఉంటాడనడానికి తాజా పాటే ఉదహరణ. అతని చేష్టలను సోషల్ మీడియా అభిమానులు ఎంతగానో ఇష్టపడతారు.
ఇదీ చదవండి: అద్భుత ప్రదర్శనపై సిరాజ్ భావోద్వేగం