అడిలైడ్‌లో కొవిడ్ వ్యాప్తి కారణంగా ఆసీస్ ఆటగాళ్లు 14 రోజులు స్వీయ నిర్భంధంలో ఉండాల్సి వస్తోంది. ఈ మేరకు వచ్చే నెలలో జరిగే భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ నిర్వహణపై అనుమానానాలు తలెత్తుతున్నాయి. ఈ విషయమై ఆ దేశ క్రికెట్ బోర్డు స్పష్టతనిచ్చింది.
డిసెంబర్ 17 న షెడ్యూల్ ప్రకారం ఆసీస్‌తో భారత్‌కు టెస్టు మ్యాచ్ జరగనుందని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు పేర్కొంది. అడిలైడ్‌తో పాటు సమీప ప్రాంతాల్లోనూ కొవిడ్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న కారణంగా సోమవారం నుంచి కెప్టెన్ టిమ్ పైన్ హోటల్ రూంలో ఐసోషలేషన్లో ఉంటారని తెలిపింది.
ఐపీఎల్లో పాల్గొన్న భారత్, ఆస్ట్రేలియాకు చెందిన పలువురు ఆటగాళ్లు.. సిడ్నీలో గురువారం నుంచే స్వీయ నిర్బంధంలో ఉంటున్నారు.
నవంబర్ 27న ప్రారంభమై జనవరి 19న ముగిసే ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది. డిసెంబర్ 17న అడిలైడ్ వేదికగా తొలి డే/నైట్ టెస్టు జరగనుంది.
అయితే, సిడ్నీలో కరోనా తీవ్రత లేకపోవడం వల్ల పరిమిత ఓవర్ల మ్యాచ్‌లకు ఎటువంటి ఇబ్బందులు లేవు. తొలి రెండు వన్డేలు, ఆఖరి రెండు టీ20లు సిడ్నీ వేదికగా, రెండో వన్డే, మొదటి టీ20 మ్యాచ్ కాన్‌బెర్రాలో జరగనున్నాయి.
ఇదీ చదవండి:భారత క్రికెట్ అభిమానుల గుండె పగిలిన రోజు