ETV Bharat / sports

'బ్లాక్​ లైవ్స్​ మేటర్​​​'కు ఆసీస్ జట్టు​ మద్దతు - భారత్​తో తలపడనున్న ఆస్ట్రేలియా

జాతి వివక్షకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమానికి మద్దతు తెలుపుతూ ఆస్టేలియా జట్టు 'బేర్​ ఫుట్​' సర్కిల్​ ఫామ్​ చేయనుందని ఆ జట్టు ఆటగాడు ప్యాట్ కమిన్స్ తెలిపాడు. భారత్​తో జరగబోయే సిరీస్​లో ఈ విధంగా చేస్తామని అన్నాడు.

Barefoot circle
మ్యాచ్​కు ముందు 'బేర్​ ఫుట్ సర్కిల్'లో అసీస్ జట్టు
author img

By

Published : Nov 16, 2020, 10:13 PM IST

భారత్​తో జరిగే సిరీస్​​లో ప్రతి ఫార్మాట్​లో ఆడే తొలి మ్యాచ్​కు ముందు ఆస్ట్రేలియా జట్టు 'బేర్​ ఫుట్'​ సర్కిల్​ చేస్తుందని ఆ జట్టు ఆటగాడు ప్యాట్ కమిన్స్​ తెలిపాడు. 'బ్లాక్​ లైవ్స్​ మేటర్​​​' ఉద్యమానికి మద్దతు తెలపడానికి ఈ విధంగా చేయనున్నట్లు చెప్పాడు. చెప్పులు, బూట్లు కాళ్లకు లేకుండా ఆటగాళ్లంతా వృత్తాకారంలో నిలబడి మౌనం పాటించడాన్నే బేర్​ ఫుట్​ సర్కిల్​ ఫామ్ అంటారు.

'బ్లాక్​ లైవ్స్​ మేటర్​​​'పై ఆస్ట్రేలియా జట్టు మౌనంగా ఉందని విండీస్​ ఆటగాడు మైకేల్ హోల్డింగ్​ చేసిన ఆరోపణలను గుర్తుచేసుకున్నాడు కమిన్స్​. తాము జాతి వివక్షకు పూర్తి వ్యతిరేకమని చెప్పాడు​. ఈ విషయంపై తాము ఆ సమయంలో పెద్దగా స్పందించలేకపోయామని విచారం వ్యక్తం చేశాడు.

" జాతి వివక్షను వ్యతిరేకిస్తూ ఒక్కొక్కరు ఒక్కోలా తమ నిరసనలు తెలిపారు. కానీ, మేం జట్టుతో మూకుమ్మడిగా నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యాం. అందుకే భారత్​తో జరిగే సిరీస్​లో బేర్​ ఫుట్​ సర్కిల్​ ఫామ్​ చేయనున్నాం".

- ప్యాట్ కమిన్స్, అసీస్ ఆటగాడు

నవంబరు 27 నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనలో భారత్- ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు జరగనున్నాయి.

ఇదీ చదవండి:ఒలింపిక్స్​ కోసం స్టేడియానికి వీక్షకులు: థామస్ బాచ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.