ETV Bharat / sports

డెత్‌ ఓవర్లలో బౌలింగ్‌.. తప్పు ఒప్పుకున్న కెప్టెన్ రోహిత్‌ - టీమ్ ఇండియా కెప్టెన్​ రోహిత్​ శర్మ

India South Africa Series 2022 : దక్షిణాఫ్రికాపై సిరీస్‌ విజయంతో టీమ్‌ఇండియా ఉత్సాహంగా ఉంది. కానీ జట్టులో ఇంకా సమస్యలు ఉన్నాయి. గత ఐదారు మ్యచుల్లో తమ డెత్​ ఓవర్ల బౌలింగ్ ఆందోళన కరంగా ఉందని రోహిత్​ స్వయంగా ఒప్పుకున్నాడు. జట్టు పరిస్థితిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

India South Africa Series 2022
India South Africa Series 2022
author img

By

Published : Oct 3, 2022, 10:39 PM IST

India South Africa Series 2022 : దక్షిణాఫ్రికాపై సిరీస్‌ విజయంతో టీమ్‌ఇండియా సగర్వంగా టీ20 ప్రపంచకప్‌ వైపు అడుగులు వేసింది. గువాహటిలో జరిగిన రెండో టీ20లో రోహిత్‌ సేన దంచికొట్టింది. అయితే.. ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. అటువైపు నుంచి కూడా అంతే దీటుగా సమాధానం వచ్చింది. లక్ష్యానికి కేవలం 16 పరుగుల దూరంలోనే సఫారీలు నిలిచిపోయారు. కొండంత స్కోరు చేసినా బౌలర్లు తేలిపోవడంతో గెలుపు కోసం భారత్‌ కష్టపడక తప్పలేదు. ఈ నేపథ్యంలో మరోసారి టీమ్‌ ఇండియా డెత్‌ ఓవర్ల బౌలింగ్‌పై చర్చ మొదలైంది. మ్యాచ్‌ అనంతరం ఈ అంశంపై సారథి రోహిత్‌ కూడా స్పందించాడు.

డెత్‌ ఓవర్ల అంశం ఆందోళన కలిగించకపోయినా.. మ్యాచ్‌ చివరలో జట్టు తన పనితీరును మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందని రోహిత్‌ చెప్పాడు. 'జట్టు ఒక నిర్ధిష్ట పద్ధతితో బౌలింగ్‌ చేయాలని కోరుకుంటుంది. ఆ రకంగా బౌలర్లకు స్వేచ్ఛనివ్వాలనుకుంటాం. నిజమే.. మేం గత ఐదారు మ్యాచ్‌ల్లో డెత్‌ ఓవర్లలో బాగా బౌలింగ్‌ చేయలేదు. ఆ అంశమే మాకు సవాలు విసిరేది' అని రోహిత్‌ పేర్కొన్నాడు.

'అయితే.. డెత్‌ ఓవర్లలో బౌలింగ్‌, బ్యాటింగ్‌ చేయడం కష్టంతో కూడుకున్న పని. ఆట ఫలితం తేలేదీ ఇక్కడే. ఇది ఆందోళన చెందే విషయమని నేను చెప్పను. కానీ.. ఇది కచ్చితంగా మనం కలిసికట్టుగా చర్యలు తీసుకోవాల్సిన అంశం' అని హిట్‌మ్యాన్‌ వివరించాడు.

తొలి టీ20లో అదరగొట్టిన అర్ష్‌దీప్‌ ఈ మ్యాచ్‌లో ఏకంగా 62 పరుగులివ్వడమే కాదు.. మూడు నోబాల్స్‌, రెండు వైడ్లు వేసి ప్రపంచకప్‌ ముంగిట మన బౌలింగ్‌పై ఆందోళనను ఇంకా పెంచాడు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ ఇండియా.. 3 వికెట్లకు 237 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఛేదన ఆరంభంలో తడబడ్డా దక్షిణాఫ్రికా ఆ తర్వాత గట్టి పోటీ ఇచ్చింది. మిల్లర్‌ 47 బంతుల్లో 106 బాది నాటౌట్‌గా నిలిచాడు, డికాక్‌ 48 బంతుల్లో 69 పరుగులతో చెలరేగడ వల్ల 3 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది.

ఇవీ చదవండి: క్లీన్​స్వీప్​​పై టీమ్​ఇండియా కన్ను.. ఆ ప్లేయర్స్​కు విశ్రాంతి

తెలుగుతేజం మెరుపులు.. ఆసియా కప్​లో మహిళల సత్తా.. మలేసియా చిత్తు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.