India Pakistan Series : భారత్- పాకిస్థాన్ మధ్య క్రికెట్ సంబంధాలను పునరుద్ధరించాలని ఆ దేశ క్రికెట్ బోర్డు డిమాండ్ చేస్తుందని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపారు. అయితే అది కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఆహ్వానం మేరకు మ్యాచ్‌లు చూసేందుకు పాక్‌కు వెళ్లిన బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా.. భారత్‌కు చేరుకున్నారు. పంజాబ్‌లోని అమృత్సర్ సరిహద్దు ప్రాంతమైన అట్టారీ- వాఘ్ బోర్డర్ ద్వారా భారత్‌కు విచ్చేశారు.
-
#WATCH | Punjab: BCCI President Roger Binny and Vice-President Rajeev Shukla arrive at the Attari–Wagah border in Amritsar after visiting Pakistan pic.twitter.com/pYvbHgCxiO
— ANI (@ANI) September 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Punjab: BCCI President Roger Binny and Vice-President Rajeev Shukla arrive at the Attari–Wagah border in Amritsar after visiting Pakistan pic.twitter.com/pYvbHgCxiO
— ANI (@ANI) September 6, 2023#WATCH | Punjab: BCCI President Roger Binny and Vice-President Rajeev Shukla arrive at the Attari–Wagah border in Amritsar after visiting Pakistan pic.twitter.com/pYvbHgCxiO
— ANI (@ANI) September 6, 2023
'పాక్ పర్యటన అద్భుతం'
BCCI Vice President Pak Visit : పాక్‌లో రెండు రోజుల పర్యటన అద్భుతంగా సాగిందని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపారు. పీసీబీ ఆతిథ్యం బాగుందని చెప్పారు. "అక్కడి గవర్నర్.. ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. శ్రీలంక, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ ఆటగాళ్లను కలిశాం. రెండు దేశాల మధ్య సిరీస్ కోసం (పీసీబీ) డిమాండ్ చేస్తోంది. క్రికెట్ సంబంధాలు పునరుద్ధరించాలని కోరారు. ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం. వాళ్లు (కేంద్ర ప్రభుత్వం) ఏం చెబితే మేం అదే చేస్తాం. ఇది పూర్తిగా క్రికెట్ పర్యటన. ఎలాంటి రాజకీయ అజెండా లేదు" అని మరోసారి రాజీవ్ తేల్చిచెప్పారు.
'రాజుల్లా చూసుకున్నారు!'
BCCI President Pak Visit : పాకిస్థాన్ పర్యటనను అద్భుతమైన అనుభవంగా బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ వర్ణించారు. పీసీబీ ఆతిథ్యం చాలా బాగుందని చెప్పారు. "పాక్ పర్యటన ఓ అద్భుతమైన అనుభవం. 1984లో టెస్ట్ మ్యాచ్ కోసం పాక్‌కు వెళ్లినప్పుడు.. మాకు అలాంటి ఆతిథ్యమే ఇచ్చారు. మమ్మల్ని రాజుల్లా చూసుకున్నారు. పాకిస్థాన్ అధికారులందరినీ మర్యాదపూర్వకంగా కలిశాం. మేము పాక్‌కు వెళ్లడం వాళ్లకు ఎంతో ఆనందంగా ఉందో.. మాకు కూడా అంతే ఆనందంగా ఉంది" అని రోజర్ బిన్నీ తెలిపారు.
2008లో చివరసారిగా..
India Pakisthan Last Visit : దౌత్యపరమైన ఇబ్బందులు కారణంగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య గత కొన్నేళ్లుగా ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. కేవలం ఐసీసీ, బీసీసీఐ టోర్నీల్లో మాత్రమే ఇరు జట్లు తలపడుతున్నాయి. చివరిసారిగా 2008లో ఆసియా కప్ కోసం భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్‌కు వెళ్లింది. అయితే 2012లో టెస్ట్ మ్యాచ్ కోసం భారత్‌కు వచ్చిన పాక్ జట్టు.. త్వరలో జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు రానుంది.
సెప్టెంబర్ 10న భారత్x పాక్ మ్యాచ్
Asia Cup 2023 Super Four : ఆసియా కప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్, పాకిస్థాన్‌ల మధ్య సూపర్-4 మ్యాచ్.. బుధవారం జరగనుంది. ఇప్పటికే సూపర్-4కు గ్రూప్-ఎ నుంచి పాకిస్థాన్, భారత్.. గ్రూప్-బి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్ అర్హత సాధించాయి. సెప్టెంబర్ 10న పాకిస్థాన్‌తో.. 12న శ్రీలంకతో.. 15న బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది. సెప్టెంబర్ 17వ తేదీన ఫైనల్ జరగనుంది.
Asia cup 2023 Ind VS Pak : భారత్ వర్సెస్ పాక్.. ఎవరి బౌలింగ్ ఎలా ఉందంటే?
Asia Cup 2023 Venue : భారీ వర్షాల ఎఫెక్ట్.. భారత్-పాక్ వాషౌట్తో కీలక నిర్ణయం.. వేదికల్లో మార్పు!