ఇంగ్లాండ్‌తో నేటి (శుక్రవారం) నుంచి ప్రారంభమయ్యే టెస్టు మ్యాచ్ పూర్తయ్యాక టీమ్‌ఇండియా.. ఆ జట్టుతో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. జులై 7, 9, 10 తేదీల్లో టీ20లు జరగనుండగా.. 12, 14, 17 తేదీల్లో వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. అందుకోసం భారత జట్టు సెలెక్షన్ కమిటీ వేర్వేరు జట్లను ప్రకటించింది.
అయితే, టీ20 సిరీస్‌కు ప్రత్యేకంగా రెండు బృందాలను ఎంపిక చేయడం గమనార్హం. ఇంగ్లాండ్‌తో రీషెడ్యూల్ చేసిన ఐదో టెస్టుకు, తొలి టీ20 మధ్య ఎక్కువ సమయం లేకపోవడమే అందుకు కారణంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కెప్టెన్ రోహిత్ శర్మ మినహా ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ ఆడిన జట్టే ఇంగ్లాండ్‌తో తొలి టీ20లో బరిలోకి దిగనుంది. ఇక రెండో టీ20 నుంచి స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉంటారు. ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన చేసిన అర్ష్‌దీప్ సింగ్.. వన్డేల్లో అరంగేట్రం చేయనున్నాడు.
తొలి టీ20 జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హూడా, రాహుల్ త్రిపాఠి, దినేశ్ కార్తీక్ (కీపర్), హార్దిక్ పాండ్య, వెంకటేశ్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, రవిబిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్.
రెండు, మూడు మ్యాచ్‌లకు: రోహిత్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హూడా, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్ (కీపర్), రిషభ్ పంత్ (కీపర్), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, రవిబిష్ణోయ్, జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, అవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్.
వన్డే జట్టు: రోహిత్ (కెప్టెన్), శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ (కీపర్), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, జస్ప్రిత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.
ఇంగ్లాండ్ టీ20 జట్టు: బట్లర్ (కెప్టెన్), మొయిన్ అలీ, హ్యారీ బ్రూక్, సామ్ కరన్ , రిచర్డ్ గ్లీసన్, క్రిస్ జోర్దాన్, లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, టైమల్ మిల్స్, మాథ్యూ పార్కిన్సన్, జాసన్ రాయ్, ఫిల్ సాల్ట్, రీస్ టోప్లీ, డేవిడ్ విల్లీ.
ఇంగ్లాండ్ వన్డే జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), మొయిన్ అలీ, జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, సామ్ కరన్, లివింగ్‌స్టోన్, ఓవర్టన్, మాథ్యూ పార్కిన్సన్, జో రూట్, జాసన్ రాయ్, ఫిల్ సాల్ట్, బెన్ స్టోక్స్, రీస్ టోప్లీ, డేవిడ్ విల్లీ.
ఇదీ చూడండి: India vs England: గెలిస్తే అరుదైన ఘనత.. రీషెడ్యూల్ టెస్టు ప్రత్యేకతలివే!