ETV Bharat / sports

IND VS WI: కోహ్లీ డకౌట్​.. ఫ్యాన్స్​కు మళ్లీ నిరాశే!

IND VS WI Kohli Duck out: వెస్టిండీస్​తో జరుగుతున్న మూడో వన్డేలో కోహ్లీ డకౌట్​గా వెనుదిరిగాడు. ఈ సిరీస్​ అతడు 50ప్లస్​ స్కోరు చేయలేకపోయాడు. 2015 తర్వాత వన్డే సిరీస్​లో విరాట్​ హాఫ్​సెంచరీ చేయకపోవడం ఇదే తొలిసారి.

kohli duck out
కోహ్లీ డకౌట్​
author img

By

Published : Feb 11, 2022, 4:24 PM IST

Updated : Feb 11, 2022, 4:30 PM IST

IND VS WI Kohli Duck out: సెంచరీ చేస్తాడని ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన టీమ్ఇండియా మాజీ సారథి కోహ్లీ అభిమానులకు మళ్లీ నిరాశే ఎదురైంది. ప్రస్తుతం వెస్టిండీస్​తో జరుగుతున్న మూడో మ్యాచ్​లో అతడు డకౌట్​గా వెనుదిరిగాడు.

దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్​.. భారీ పరుగులతో రాణిస్తాడని ఫ్యాన్స్​ ఆశపడ్డారు. కానీ అతడు 51,0,65 రన్స్​ చేసి సెంచరీ మార్క్​ను అందుకోలేకపోయాడు. కనీసం స్వదేశంలో వెస్డిండీస్​తో జరుగుతున్న సిరీస్​లోనైనా శతకం సాధిస్తే చూడాలనుకున్నారు. కానీ వారి అంచనాలు విరాట్​ తలకిందులు చేశాడు.

తొలి వన్డేలో(4 బంతుల్లో 8 పరుగులు), రెండో వన్డేలో(30 బంతుల్లో 18), మూడో వన్డేలో డకౌట్​గా వెనుదిరిగాడు. కాగా, విరాట్​.. 2015 తర్వాత వన్డే సిరీస్​లో 50 ప్లస్​ స్కోరు చేయకపోవడం ఇదే తొలిసారి. దీంతో కోహ్లీ ప్రదర్శనపై అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తుండగా.. మరి కొంత మంది నెటిజన్లు సెట్టైర్లు వేస్తున్నారు.

నాలుగో స్థానంలో

కోహ్లీ వన్డేల్లో డకౌట్​ కావడం ఇది 15వ సారి. టీమ్​ఇండియా తరఫున వన్డేల్లో అత్యధికసార్లు డకౌట్​ అయిన బ్యాటర్​గా విరాట్​ నాలుగో స్థానంలో ఉన్నాడు. అంతకుముందు సచిన్​(20), యువరాజ్​ సింగ్​(18), గంగూలీ(16) ఉన్నారు. అన్ని ఫార్మాట్లలో కలిపి కోహ్లీ ఇప్పటివరకు 32 సార్లు డకౌట్​ అయి రెండో స్థానంలో ఉన్నాడు. తొలి స్థానంలో సచిన్​(34), మూడో స్థానంలో సెహ్వాగ్​(31) ఉన్నారు.

ఇదీ చూడండి: ఐపీఎల్​లో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు వీరే!

Last Updated : Feb 11, 2022, 4:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.