ETV Bharat / sports

వెస్టిండీస్​తో టీ20 సిరీస్​.. వాషింగ్టన్ సుందర్​ దూరం! - Washington Sundar hamstring strain

IND vs wI T20: వెస్టిండీస్​తో జరగనున్న మూడు మ్యాచ్​ల టీ20 సిరీస్​ నుంచి వాషింగ్టన్​ సుందర్ తప్పుకోనున్నాడు. అతనికి తొడకండరం గాయపడిట్లు తెలుస్తోంది.

IND vs wI T20
వాషింగ్టన్​ సుందర్
author img

By

Published : Feb 14, 2022, 10:13 PM IST

IND vs wI T20: వెస్టిండీస్​తో జరగనున్న మూడు మ్యాచ్​ల టీ20 సిరీస్​కు వాషింగ్టన్​ సుందర్ అందుబాటులో ఉండట్లేదని తెలిసింది. అతనికి తొడకండరం గాయం అయినట్లు బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు. బెంగళూరలోని నేషనల్​ క్రికెట్​ అకాడమీకి తరలించనున్నారు. టీమ్​ఇండియా ప్లేయర్స్​ కేఎల్​ రాహుల్​, ఆల్​రౌండర్​ అక్సర్​ పటేల్​ వెస్టిండీస్​తో జరగాల్సిన టీ20 సిరీస్​కు ఇప్పటికే దూరమయ్యారు. వారి స్థానాల్లో రుతురాజ్​ గైక్వాడ్​, దీపక్​ హూడాకు అవకాశమివ్వనున్నట్లు తెలిపింది బీసీసీఐ.

"తొడకండరం గాయం అయిన కారణంగా సుందర్​ ఈ రోజు (సోమవారం) ప్రాక్టీస్ చేయలేదు. వచ్చే టీ20 సిరీస్​కు అతను ఆడేలా కనిపించట్లేదు."

-బీసీసీఐ అధికారి

వెస్టిండీస్​తో కోల్​కతా వేదికగా మూడు మ్యాచ్​ల టీ20 సిరీస్ బుధవారం(16-02-2022) నుంచి ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ సారథ్యంలో టీమ్​ఇండియా వెస్టిండీస్​తో తలపడనుంది.

ఇదీ చదవండి: IPL 2022: సీఎస్కే.. ఈ సారి వేలంలో రూటు మార్చిందిగా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.