ETV Bharat / sports

IND vs WI team squad 2023 : ఓపెనర్​గా యశస్వి జైశ్వాల్​.. మూడో స్థానంలో గిల్​ - మూడో స్థానంలో గిల్

IND vs WI team squad 2023 : మరి కొన్ని గంటల్లో వెస్టిండీస్​తో సిరీస్ ప్రారంభంకానుంది. ఇందులో భాగంగా టీమ్​ఇండియా- విండీస్​ తొలి టెస్టు ఆడనున్నాయి. ఈ మ్యాచ్​తో యశస్వి జైశ్వాల్​ టెస్ట్ అరంగేట్రం చేయనున్నాడు. గిల్​ మూడో స్థానంలో రానున్నాడు.

Gill will bat at No  3  Jaiswal to open against West Indies  Rohit
IND vs WI team squad 2023 : ఓపెనర్​గా యశస్వి జైశ్వాల్​.. మూడో స్థానంలో గిల్​
author img

By

Published : Jul 12, 2023, 7:47 AM IST

Updated : Jul 12, 2023, 7:58 AM IST

IND vs WI team squad 2023 : ఈ ఏడాది ఐపీఎల్​లో మంచి ప్రదర్శన చేసి జాతీయ జట్టుకు ఎంపికైన యశస్వి జైస్వాల్.. టెస్ట్ అరంగేట్రం చేయబోతున్నాడు. మరి కొన్ని గంటల్లో వెస్టిండీస్​తో ప్రారంభం కానున్న మొదటి టెస్టులో అతడు ఓపెనర్​గా దిగబోతున్నాడు. ఈ విషయాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. దీంతో హిట్​మ్యాన్​-యశస్వి కలిసి ఓపెనర్లుగా బరిలో దిగబోతున్నారు. డబ్ల్యూటీసీ వరల్డ్ టెస్ట్​ ఛాంపియన్​షిప్​ ఫైనల్​లో స్టాండ్ బై ప్లేయర్​గా ఉన్న యశస్వికి.. అప్పుడు ఆడే ఛాన్స్ దక్కలేదు. కానీ ఈ సారి విండీస్​ పర్యటనకు ఎంపికవ్వడంతో పాటు మొదటి టెస్టులోనే ఆడే అవకాశం దక్కించుకోవడం విశేషం.

ఇకపోతే 2021లో ఆస్ట్రేలియాపై టెస్ట్​ అరంగేట్రం చేసిన శుభమన్​ గిల్.. అప్పటి నుంచి ఓపెనర్​గానే బరిలో దిగుతున్నాడు. అయితే ఈ సారి యశస్వి ఓపెనర్​గా ఎంట్రీ ఇవ్వడంతో.. గిల్​ మూడో స్థానంలో ఆడనున్నట్లు హిట్​మ్యాన్​ పేర్కొన్నాడు. సీనియర్ బ్యాటర్ ఛెతేశ్వర్ పుజారాను.. ఈ సిరీస్​కు ఎంపిక చేయకపోవడం వల్ల అతడి స్థానంలోనే గిల్​ను బ్యాటింగ్​కు దింపుతున్నారు. ఈ మ్యాచ్​లో ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగబోతున్నట్లు రోహిత్ చెప్పాడు.

జైశ్వాల్​ను ఓపెనింగ్​కు దింపడం వల్ల.. మునపటిలాగే లెఫ్ట్ రైట్ ఓపెనింగ్​ కాంబినేషన్​తో టీమ్​ఇండియా ముందుకెళ్లనుందని రోహిత్ అన్నాడు. ఈ బ్యాటింగ్ ఆర్డర్​ గురించి రోహిత్ మాట్లాడుతూ.. "గిల్​ స్వయంగా తానంట తానే మూడో స్థానంలో బ్యాటింగ్​కు వస్తానని చెప్పాడు. కోచ్​ రాహుల్ భాయ్​ దగ్గరికి వెళ్లి ఈ స్థానంలో ఆడతానని రిక్వెస్ట్ చేశాడు. ఈ స్థానంలో అతడు మరింత మెరుగ్గా ఆడగలనని, జట్టుకు బాగా సహకరించగలనని చెప్పాడు. ఏదేమైనప్పటికీ ఓపెనింగ్​ లో లెఫ్ట్-రైట్ కాంబినేషన్​ ఉండటం మంచి విషయం. ఈ కాంబినేషన్​ లాంగ్​ టెర్మ్​కు మంచి పరిష్కారం అవ్వాలని ఆశిస్తున్నాను. జైశ్వాల్​ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటాడని భావిస్తున్నాను." అని పేర్కొన్నాడు. కాగా, దులీప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీల్లో సెంచరీలతో పాటు ఐపీఎల్ 2023లోనూ యశస్వి అద్భుత పామ్​ కనబరిచాడు. ఈ సీజన్​లో అతడు 625 పరుగులను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో అతడికి ఈసారి జట్టులో చోటు దక్కింది.

వికెట్ కీపర్​ ఎవరో?.. వికెట్​ కీపర్​ స్థానంలో ఇషాన్ కిషన్​-కేఎస్ భరత్ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇషాన్‌ కిషాన్​కు అవకాశమొస్తే.. ఇదే అతడికి తొలి టెస్టు అవుతుంది. ఇక 5 టెస్టు మ్యాచుల్లో ఆడియన ఆంధ్ర ప్లేయర్​ కేఎస్‌ భరత్‌.. 8 ఇన్నింగ్స్‌ల్లో 129 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అతడు వికెట్ల వెనుకాల చురుగ్గానే రాణిస్తున్నప్పటికీ.. బ్యాటింగ్‌లో మాత్రం తేలిపోతున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఇద్దరు స్పిన్నర్లను ఆడించే ఛాన్స్​ ఉంది కాబట్టి వికెట్​ కీపింగ్​లో ఉన్న టాలెంట్​ దృష్ట్యా భరత్‌నే ఎక్కువగా తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

ఇక కెప్టెన్‌ రోహిత్‌, కోహ్లీ, రహానె.. ఈ ముగ్గురు సీనియర్లుగా తమ బ్యాట్​తో బాగా రాణించాల్సిన అవసరం ఉంది. వీళ్లు మంచిగా రాణించి కుర్రాళ్లకు స్ఫూర్తిగా నిలవాలి. కెప్టెన్​గా రోహిత్‌కు ఈ సిరీస్‌ పెద్ద పరీక్ష లాంటిదని చెప్పాలి. ఇకపోతే ఏడాదిన్నర గ్యాప్ తర్వాత డబ్ల్యూటీసీ ఫైనల్​ కోసం టీమ్​లోకి వచ్చిన రహానె.. అందులో బాగా రాణించాడు. ఇక ప్రస్తుత సిరీస్‌లో ఎలా రాణిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. అతడు ఫెయిల్ అయితే మాత్రం.. అతడి స్థానాన్ని అందుకోవడానికి రుతురాజ్‌ రెడీగా ఉన్నాడు.

ఇదీ చూడండి :

IND VS WI 2023 : వారిలో అవకాశం అందుకునేదెవరో.. సత్తా చాటేదెవరో?

IND VS WI TEST 2023 : టీమ్​ఇండియా టాప్​ -5 బౌలర్స్​.. విండీస్​పై అత్యధిక వికెట్లు తీసింది వీరే!

Last Updated : Jul 12, 2023, 7:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.