ETV Bharat / sports

IND Vs WI 1st T20 : సూపర్​ రికార్డ్​కు అడుగు దూరంలో 'కెప్టెన్'​.. యశస్వి, తిలక్​ ఎంట్రీ!

IND Vs WI 1st T20 Hardik Pandya : వెస్టిండీస్​తో తొలి టీ20 ముందు టీమ్​ఇండియా తాత్కాలిక కెప్టెన్​ హార్దిక్​ పాండ్యను అరుదైన రికార్డును ఊరిస్తోంది. అదేంటంటే?

hardik pandya
hardik pandya
author img

By

Published : Aug 3, 2023, 9:22 AM IST

IND Vs WI 1st T20 : ప్రపంచ టెస్ట్​ ఛాంపియన్​ షిప్​ తర్వాత వెస్టిండీస్​ పర్యటనకు వెళ్లిన టీమ్​ఇండియా.. కరేబియన్​ టూర్​లో చివరి సిరీస్​ ఆడేందుకు సిద్ధమైంది. ఇప్పటికే టెస్ట్​, వన్డే సిరీస్​లు కైవసం చేసుకున్న భారత్​.. టీ20 సిరీస్​ కూడా నెగ్గేందుకు ఉవ్విళ్లూరుతోంది. ట్రినిడాడ్​ వేదికగా గురువారం నుంచి భారత్‌-వెస్టిండీస్‌ మధ్య ఐదు టీ20ల సిరీస్‌ ప్రారంభం కానుంది. బ్రియాన్‌ లారా స్టేడియంలో జరగనున్న తొలి టీ20లో సత్తా చాటేందుకు హార్దిక్‌ పాండ్య నేతృత్వంలోని యువ భారత ప్లేయర్లు తహాతహలాడుతున్నారు.

IND Vs WI 1st T20 Hardik Pandya : ఇకపోతే.. ఈ మ్యాచ్‌కు ముందు టీమ్​ఇండియా తాత్కాలిక కెప్టెన్‌, స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో పాండ్య రెండు వికెట్ల సాధిస్తే.. టీ20 క్రికెట్‌లో 150 వికెట్ల మైలు రాయిని అందుకుంటాడు. తద్వారా టీ20 క్రికెట్‌లో 4000 పరుగులతో పాటు 150 వికెట్లు అందుకున్న తొలి భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. టీ20 క్రికెట్‌లో హార్దిక్‌ ఇప్పటివరకు 4348 పరుగులతో పాటు 148 వికెట్లు పడగొట్టాడు.

IND Vs WI 1st T20 Kuldeep Yadav : మరోవైపు టీమ్​ఇండియా స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ కూడా ఓ అరుదైన ఘనతకు చేరువలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో కుల్దీప్‌ మరో నాలుగు వికెట్లు పడగొడితే.. అంతర్జాతీయ టీ20ల్లో 50 వికెట్ల పడగొట్టిన భారత బౌలర్ల జాబితాలో చేరుతాడు. దీంతో టీ20ల్లో అత్యంత వేగంగా 50 వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌ యుజ్వేంద్ర చాహల్‌ను అధిగమిస్తాడు. చాహల్‌ 34 మ్యాచ్‌లలో ఈ ఘనత సాధించాడు. కుల్దీప్‌ ఇప్పటివరకు 28 మ్యాచ్‌లు ఆడి 46 వికెట్లు పడగొట్టాడు.

జైశ్వాల్‌, తిలక్‌ వర్మ ఎంట్రీ..
IND Vs WI 1st T20 News : విండీస్‌తో జరగనున్న తొలి మ్యాచ్‌తో విధ్వంసకర ఓపెనర్‌ యశస్వీ జైశ్వాల్‌, యువ ఆటగాడు తిలక్‌ వర్మ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అడుగుటపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టెస్టు జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన జైశ్వాల్‌.. తన సత్తా ఎంటో నిరూపించుకున్నాడు. తొలి టెస్టు మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీతో చెలరేగి రికార్డు సృష్టించాడు. ఇప్పుడు తన ఫేవరేట్‌ ఫార్మాట్‌ టీ20ల్లో కూడా సత్తా చాటేందుకు యశస్వి సిద్ధమయ్యాడు. ఐపీఎల్‌లో అదరగొట్టి తొలి భారత జట్టుకు ఎంపికైన తిలక్‌ వర్మకు కూడా తుది జట్టులో చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: IND Vs WI 1st T20 : విండీస్‌తో టీ20 సిరీస్‌ నేటి నుంచే.. మన కుర్రాళ్లకు పెద్ద సవాలే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.