IND vs SL World Cup 2023 : 2023 వరల్డ్‌కప్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమ్ఇండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ (88 పరుగులు), శుభ్‌మన్ గిల్ (92 పరుగులు) అద్భుతంగా రాణించారు. ఈ ఇద్దరూ లంక బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ.. సెంచరీకి దగ్గరగా వెళ్లారు. కానీ, అనూహ్యంగా వీరిద్దరినీ బౌలర్ మధుషంక.. తన వరుస ఓవర్లలో పెవిలియన్ చేర్చాడు. వీరిద్దరూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తూ.. రెండో వికెట్‌కు 189 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే విరాట్.. మాస్టర్ బ్లాస్టర్ తెందూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. అదేంటంటే?
విరాట్ ఈ ఏడాది వన్డేల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఆతడు 34 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ ఫీట్ అందుకున్నాడు. అయితే ఓ క్యాలెండర్ ఇయర్లో 1000+ పరుగులు సాధించడం, విరాట్‌కు ఇది ఎనిమిదోసారి. ఇప్పటివరకు సచిన్ తెందూల్కర్, విరాట్.. సమానంగా 7 సార్లు ఈ ఫీట్ అందుకున్నారు. తాజా మ్యాచ్‌తో విరాట్.. ఈ రికార్డును బ్రేక్ చేశాడు.
విరాట్ మూడోసారి.. ప్రస్తుత మెగాటోర్నీలో విరాట్ అత్యుత్తమ ఫామ్‌తో దూసుకుపోతున్నాడు. అయితే ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన విరాట్.. 15 పరుగులలోపే మూడుసార్లు సెంచరీ సాధించే ఛాన్స్ మిస్ చేసుకున్నాడు. అతడు ఈ టోర్నీలో.. ఆస్ట్రేలియాపై 88, న్యూజిలాండ్‌పై 95, తాజాగా శ్రీలంకపై 88 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక 7 మ్యాచ్‌ల్లో విరాట్.. 88.40 సగటుతో 442 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీ, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక పరుగుల చేసిన లిస్ట్‌లో విరాట్.. రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. సౌతాఫ్రికా బ్యాటర్ క్వింటన్ డికాక్ 545 పరుగులతో టాప్‌లో ఉన్నాడు. కాగా, టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ 402 పరుగులతో టాప్-5లో కొనసాగుతున్నాడు.
విరాట్ వన్డే కెరీర్ విషయానికొస్తే.. వన్డేల్లో 288 మ్యాచ్‌లు ఆడిన విరాట్.. 58.05 సగటుతో 13525 పరుగులు చేశాడు. ఇందులో 48 సెంచరీలు, 70 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. విరాట్ ఇంకొక్క సెంచరీ నమోదు చేస్తే.. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ (49 శతకాలు) సరసన చేరతాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి ఇప్పటివరకు 78 సెంచరీలు బాదాడు. ఈ క్రమంలో క్రికెట్లో అత్యధిక శతకాలు నమోదు చేసిన బ్యాటర్ల జాబితాలో రెండో ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. ఇక 100 సెంచరీలతో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టాప్‌లో ఉన్న సంగతి తెలిసిందే.
-
8⃣8⃣ runs
— BCCI (@BCCI) November 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
9⃣4⃣ deliveries
1⃣1⃣ fours
Well played, Virat Kohli! 👏👏#TeamIndia 196/3 #CWC23 | #MenInBlue | #INDvSL pic.twitter.com/gcEO1QhVgv
">8⃣8⃣ runs
— BCCI (@BCCI) November 2, 2023
9⃣4⃣ deliveries
1⃣1⃣ fours
Well played, Virat Kohli! 👏👏#TeamIndia 196/3 #CWC23 | #MenInBlue | #INDvSL pic.twitter.com/gcEO1QhVgv8⃣8⃣ runs
— BCCI (@BCCI) November 2, 2023
9⃣4⃣ deliveries
1⃣1⃣ fours
Well played, Virat Kohli! 👏👏#TeamIndia 196/3 #CWC23 | #MenInBlue | #INDvSL pic.twitter.com/gcEO1QhVgv
- " class="align-text-top noRightClick twitterSection" data="">
16 సెంచరీలతో విరాట్ - రోహిత్ దండయాత్ర - లంకపై ఆ ఘనత సాధించింది వీరే