ETV Bharat / sports

IND VS SL: శ్రీలంకతో టెస్టు సిరీస్.. ఈ రికార్డులు బ్రేక్ అవుతాయా?

author img

By

Published : Mar 3, 2022, 12:27 PM IST

IND VS SL TEST RECORDS: భారత్‌-శ్రీలంక జట్ల మధ్య శుక్రవారం ప్రారంభమయ్యే తొలి టెస్ట్‌ మ్యాచ్​ ఎంతో ప్రత్యేకత సంతరించుకుంది. టీమ్​ఇండియాలోని ఇద్దరు ప్రముఖ ఆటగాళ్లకు ఈ మ్యాచ్‌ మైలురాయి కానుంది. ఆటపై వారిద్దరిది చెరగని ముద్ర. అభిమానుల మదిలో చెదరని స్థానం. ఆ క్రికెటర్లు ఎవరో ఇప్పటికే అర్థమై ఉండొచ్చు. 100వ టెస్ట్‌ ఆడుతున్న విరాట్‌ కోహ్లీ ఒకరైతే.. సుదీర్ఘ ఫార్మాట్‌లో తొలిసారి పూర్తిస్థాయి కెప్టెన్‌ బాధ్యతలు చేపడుతున్న రోహిత్‌ శర్మ మరొకరు. ఈ టెస్టు సిరీస్​తో నమోదుకానున్న పలు రికార్డులను ఇప్పుడు చూద్దాం.

test match
kohli rohith

IND VS SL TEST RECORDS: వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమ్​ఇండియా.. శ్రీలంక జట్టుతో శుక్రవారం మొదటి టెస్టు ఆడనుంది. అయితే ఈ మ్యాచ్​కు ఎంతో ప్రత్యేకత ఉంది. భారత జట్టులో ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లకు ఓ మైలురాయి కానుంది. వారిలో వందో టెస్టు మ్యాచ్​ ఆడుతున్న కోహ్లీ ఒకరైతే, టెస్టు మ్యాచ్​కు తొలిసారిగా సారథ్యం వహిస్తున్న రోహిత్​ శర్మ మరొకరు. ఈ నేపథ్యంలో మొహాలీలో జరగనున్న టెస్టు మ్యాచ్​ను చిరస్మరణీయం చేసుకోవాలని కోహ్లీ, రోహిత్‌ భావిస్తున్నారు. అయితే ఈ సిరీస్​తో నమోదు అవ్వనున్న రికార్డులను చూద్దాం..

నమోదు కానున్న రికార్డులు..

  • భారత్​ గడ్డపై ఈసారైనా తొలి టెస్టు విజయం నమోదు చేయాలని శ్రీలంక చూస్తోంది. ఒకవేళ అదే జరిగితే ఆ జట్టు చరిత్ర సృష్టించినట్లే అవుతుంది.
  • ఐసీసీ పురుషుల టెస్టు టీమ్‌ ర్యాంకింగ్స్‌లో భారత్‌ ప్రస్తుతం ఉన్న మూడో స్థానం నుంచి అగ్రస్థానంలోకి వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సిరీస్​ గెలిస్తే ఆ అవకాశముంది.
  • విరాట్​ కోహ్లీ తన కెరీర్​లో 71వ సెంచరీ కోసం ఎదురుచూస్తున్నాడు. అది అతడు సాధిస్తే పాటింగ్​ రికార్డును సమం చేస్తాడు. వీరిద్దరి కంటే ముందు సచిన్​ 100 సెంచరీలతో ఎవరికీ అందని దూరంలో ఉన్నాడు.
  • విరాట్​ కోహ్లీ తన టెస్టు కెరీర్​లో​ 8000 పరుగుల మార్కును సాధించడానికి కేవలం 38 పరుగుల దూరంలో ఉన్నాడు.
  • ఈ మ్యాచ్​లో విరాట్​ కోహ్లీ తన కెరీర్​లో వందో టెస్టు ఆడనున్నాడు
  • ఈ సిరీస్​లో కోహ్లీ రెండు సెంచరీలు చేస్తే తన టెస్టు కెరీర్​లో సెంచరీల సంఖ్య 29కు చేరుకుంటుంది. క్రికెట్​ లెజెండ్​ సర్​​ బ్రాడ్​మన్​తో సమానమవుతాడు.
  • శ్రీలంకపై భారత్ జట్టు వరుసగా ఏడో టెస్టులో విజయం సాధించాలని ఆశిస్తోంది.
  • గత మూడు టెస్టు మ్యాచుల్లో విజయం సాధించిన శ్రీలంక జట్టు వరుసగా నాలుగో మ్యాచ్​నూ గెలవాలని చూస్తోంది.

ఇదీ చదవండి: కోహ్లీ వందో టెస్టు.. ఈ సారైనా సెంచరీ బాదుతాడా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.