శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో టీమ్ఇండియా 91 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా మూడు మ్యాచుల సిరీస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకుంది. 229 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. భారత బౌలర్ల ధాటికి 137 పరుగులకే ఆలౌటైంది. దీంతో మూడు టీ20 సిరీస్‌ని భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. లంక బ్యాటర్లలో శానక (23), ధనంజయ (22), అసలంక (19) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 3, హార్దిక్ 2, ఉమ్రాన్ మాలిక్ 2, చాహల్ 2, అక్షర్ పటేల్ 1 వికెట్ పడగొట్టారు.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు సాధించింది. సూర్య కుమార్ (112; 51 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్‌లు) శతకం బాదాడు. శుభ్‌మన్ గిల్ (46), రాహుల్ త్రిపాఠి (35), అక్షర్ పటేల్ (21) రాణించారు. లంక బౌలర్లలో మదుశంక రెండు.. రజితా, కరుణరత్నె, హసరంగ తలో వికెట్ తీశారు.
ఇదీ చూడండి: IND VS SL: సూర్యకుమార్ మెరుపు సెంచరీ.. గ్రౌండ్లో సిక్సర్ల సునామీ.. లంక లక్ష్యం ఎంతంటే?