ETV Bharat / sports

Ind Vs SL Asia Cup Finals : సిరాజ్​ అదరహో.. లంకను శాసించిన మియాభాయ్.. 50 పరుగులకే ఆలౌట్! - siraj odi wickets

Ind Vs SL Asia Cup Finals : 2023 ఆసియా కప్​ ఫైనల్​ మ్యాచ్​లో భారత బౌలర్లు నిప్పులు చెరుగుతున్నారు. మహమ్మద్ సిరాజ్ ధాటికి లంక కుప్పకూలిపోయింది.

Ind Vs SL Asia Cup Finals
Ind Vs SL Asia Cup Finals
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 17, 2023, 4:15 PM IST

Updated : Sep 17, 2023, 7:03 PM IST

Ind Vs SL Asia Cup Finals : 2023 ఆసియా కప్​ ఫైనల్​ మ్యాచ్​లో శ్రీలంక ఇన్నింగ్స్​ ముగిసింది. భారత స్టార్ పేసర్ సిరాజ్​ ధాటికి.. నిలబడలేకపోయిన లంక జట్టు 50 పరుగులకే ఆలౌటైంది. ఈ క్రమంలో ఏకంగా ఏడుగురు బ్యాటర్లు సింగిల్​ డిజిట్​కు పరిమితంగా కాగా.. అందులో నలుగురు మాత్రం పరుగుల ఖాతానే తెరవలేకపోయారు. ఇక 17 పరుగులు చేసిన కుశాల్ మెండిస్.. లంక బ్యాటర్లలో​ టాప్​ స్కోరర్​గా నిలిచాడు. వికెట్ల పతనానికి జస్​ప్రీత్ బుమ్రా శ్రీకారం చుట్టగా.. దాన్ని సిరాజ్ కొనసాగించాడు. ఫలితంగా శ్రీలంక ఏ దశలోనూ కోలుకోలేదు. ఏకంగా ఆరు వికెట్లను పడగొట్టి లంక జట్టును చిత్తు చేశాడు. ఇక హార్దిక్ పాండ్య 3, బుమ్రా 1 వికెట్ పడగొట్టారు. అద్భుత ప్రదర్శనకు గాను సిరాజ్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును దక్కించుకున్నాడు.

ఆ రికార్డు సమం..
సిరాజ్ ఈ మ్యాచ్​లో 16 బంతుల్లోనే ఐదు వికెట్లు నేలకూల్చాడు. దీంతో శ్రీలంక దిగ్గజం చమిందావాస్ రికార్డును సమం చేశాడు. చమిందావాస్ 2023 ప్రపంచకప్​లో బంగ్లాదేశ్​పై 16 బంతుల్లో ఐదు వికెట్లు తీసి ఈ ఫీట్ సాధించాడు. తాజాగా సిరాజ్ ఆ ఘనతను అందుకున్నాడు. ఇక మొత్తంగా ఈ మ్యాచ్​లో సిరాజ్​.. 7 ఓవర్లు బౌలింగ్ చేసి.. 21 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ మెయిడేన్ ఓవర్ ఉంది. ఇక సిరాజ్ వన్డే కెరీర్​లో ఇదే అత్యుత్తమ ప్రదర్శన. ఇకపోతే భారత్‌ తరఫున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన నాలుగో బౌలర్​గా సిరాజ్​ రికార్డులకెక్కాడు. అతడి కంటే ముందు స్టువర్ట్ బిన్నీ (6/4), అనిల్ కుంబ్లే (6/12), బుమ్రా (6/19) ఈ జాబితా​లో ఉన్నారు.

వన్డేల్లో @50.. ఈ మ్యాచ్​లో శ్రీలంక బ్యాటర్ అసలంక వికెట్​తో సిరాజ్.. వన్డేల్లో 50 వికెట్ల మార్క్ అందుకున్నాడు. ఇప్పటివరకు 29 వన్డే మ్యాచ్​లు ఆడిన సిరాజ్.. 4.77 ఎకనమీతో 53 వికెట్లు పడగొట్టాడు. ఇక మూడు ఫార్మాట్ (టీ20, వన్డే, టెస్టు) లో కలిపి 58 అంతర్జాతీయ మ్యాచ్​లు ఆడిన 123 వికెట్లు తీశాడు.

IND Vs SL Asia Cup : విరాట్​ టు చరిత్​.. ఆసియా కప్​ ఫైనల్స్​లో ఈ స్టార్​ ప్లేయర్లపైనే గురి!

Injured Players Before World Cup : ప్రపంచకప్​ వేళ.. గాయాల గోల.. మెగాటోర్నీకి ఆ స్టార్ బౌలర్ దూరం!

Last Updated : Sep 17, 2023, 7:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.