IND vs SA Tickets Booking Issue : 2023 ప్రపంచకప్‌లో భాగంగా నవంబర్ 5న కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్ - సౌతాఫ్రికా మ్యాచ్ జరగనుంది. అదే రోజు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బర్త్‌డే కావడం విశేషం. అయితే మామూలుగానే మెగాటోర్నీలో భారత్ మ్యాచ్ అనగానే.. ఫుల్ క్రేజ్ ఉంటుంది. అందులోనూ విరాట్ పుట్టినరోజున స్టేడియంలో తన బ్యాటింగ్ చూసే ఛాన్స్ వస్తుందంటే ఆ అవకాశాన్ని ఫ్యాన్స్ అస్సలు మిస్ అవ్వరు.
ఈ నేపథ్యంలోనే భారత్ - సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్లకు భారీగా డిమాండ్ ఏర్పడింది. అయితే నవంబర్ 5న మ్యాచ్ టికెట్లు బుక్ చేస్తుంటే.. కన్ఫార్మ్ అవ్వడం లేదంటూ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో విస్తుపోయిన ఓ క్రికెట్ ఫ్యాన్ కోల్‌కతా, మైదాన్ పోలీస్ స్టేషన్లో ఈ విషయంపై ఫిర్యాదు చేశాడు. బీసీసీఐ సహా బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లైన బుక్‌మైషో(BOOK MY SHOW), క్యాబ్ (CAB) సక్రమంగా టికెట్ల అమ్మకాలు జరపడం లేదని.. వాటిని అధిక లాభాల కోసం బ్లాక్‌లో విక్రయిస్తున్నారని ఆ అభిమాని ఆరోపించాడు.
ఇక ఈ విషయాన్ని పరిశీలించిన మైదాన్ పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా నవంబర్ 2న బుక్‌మైషో, క్యాబ్ సంస్థ నిర్వాహకులను విచారణకు పిలిచినట్లు సమాచారం. కానీ, అటు బుక్‌మైషో, ఇటు బీసీసీఐ ఈ విషయంపై ఇప్పటివరకూ అధికారికంగా స్పందించలేదు.
IND Vs SA Match Black Tickets : అయితే ఇటీవల ఇదే మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్న వ్యక్తిని.. కోల్‌కతా పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. నగరానికి చెందిన అంకిత్ అగర్వాల్ అనే వ్యక్తి రూ.2,500 మ్యాచ్ టికెట్లను రూ.11 వేలకు విక్రయించాడు. దీనిపై సమాచారం అందుకున్న కోల్‌కతా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 20 టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన జరిగిన రెండు రోజుల్లోనే.. ఆన్లైన్లో టికెట్లు బుక్ అవ్వకపోవడంపై సగటు క్రికెట్ ఫ్యాన్స్ పలు అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు.
-
Match Day feels 😎👌#TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvSL pic.twitter.com/YfCdD0Gbcc
— BCCI (@BCCI) November 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Match Day feels 😎👌#TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvSL pic.twitter.com/YfCdD0Gbcc
— BCCI (@BCCI) November 2, 2023Match Day feels 😎👌#TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvSL pic.twitter.com/YfCdD0Gbcc
— BCCI (@BCCI) November 2, 2023